Shocking: ఓరి దేవుడో.. ఇవి ఎలుకలా యమభటులా.. పెషెంట్ల గ్లూకోజ్ తాగేస్తున్నాయి.. వైరలవుతున్న వీడియో
ఇక, వీడియోని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్‌గా మారింది. ఎలుక డ్రిప్ పైపును కొరకడం.. దాని నుండి ప్రవహించే గ్లూకోజ్ నీటిని తాగడం వీడియోలో కనిపిస్తుంది.
Viral Video: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అన్నది ఒకప్పటి పాట.. అయితే, ఇప్పుడు పరిస్థితులు ఆ పాటను నిజం చేసేలా తయారయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రి అంటనే ప్రజలు వణికిపోయేలా చేస్తున్నాయి. ఆస్పత్రుల నిర్వాహణ రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. పాములు, తేళ్లు, ఎలుకలు వంటివి ప్రత్యక్షమై అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతంలో ఎలుకలు రోగుల కాళ్లు, చేతులవేళ్ళు కొరికిన ఘటనలు అనేకం చూశాం..తాజాగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా ఎలుకలు పేపైప్లైన్ ద్వారా లోపలికి వచ్చి పెషెంట్ల గ్లూకోజ్ ను తాగేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఎడమ చేతికి డ్రిప్‌తో ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న రోగిని వీడియోలో చూడవచ్చు. ఒక పెద్ద ఎలుక సీలింగ్‌లోని రంధ్రం నుండి, డ్రిప్ స్టాండ్‌పైకి పాక్‌తూ రావటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్తర్‌లోని బలిరామ్ కశ్యప్ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోగుల డ్రిప్ లైన్లు కొరికి గ్లూకోజ్ తాగుతున్న ఎలుకలు కెమెరాకు చిక్కాయి. ఆసుపత్రిలో చేరిన రోగి బంధువులు ఈ వీడియోను రికార్డు చేశారు.
छत्तीसगढ़ के इस अस्पताल का हाल देखिए…सैंकड़ों चूहे हैं जो मरीजों को लगने वाला ग्लूकोज पी जा रहे हैं। आलम ये है कि मरीजों को भले आराम न लगे लेकिन चूहे तंदुस्त हो रहे हैं।#Chhattisgarh #ViralVideo pic.twitter.com/kn8fmfa8Yp
— Hindustan (@Live_Hindustan) July 28, 2022
ఇక వీడియోని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్‌గా మారింది. ఎలుక డ్రిప్ పైపును కొరకడం.. దాని నుండి ప్రవహించే గ్లూకోజ్ నీటిని తాగడం వీడియోలో కనిపిస్తుంది. ఆసుపత్రి ఆవరణలో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని, చాలా రోజులుగా ఇక్కడ ఎలుకల సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అంగీకరించారు. మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పటి వరకు 1200 ఎలుకలను చంపినట్లు సమాచారం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి