Festivals In August 2022: ఆగష్టులో ముఖ్యమైన పండగలు.. వరలక్ష్మి వ్రతం నుంచి వినాయక చవితి వరకూ ఏ రోజు ఏ పండగలు వచ్చాయంటే
శ్రావణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే నాగ పంచమి వ్రతంతో ఈ నెల ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి తో ముగియనుంది. అయితే ఈఏడాది కృష్ణాష్టమి మిగులు తగులు రూపంలో రెండు రోజులు రావడం విశేషం..
Festivals In August 2022: హిందువులకు నెలనెలా పండగలు, పర్వదినాలు వస్తాయి. లోగిళ్ళలో సందడిని తెస్తాయి. ఇక పండగల సమయంలో పూజలు, ఉపవాసాలు చేస్తారు. ఆగస్టు నెలలో కూడా అనేక వేడుకలతో నిండి ఉంటుంది. మహిళలు, పిల్లలు, పెద్దలకు ఇష్టమైన పండుగలన్నీ ఈ నెలలో వస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం, రక్షా బంధన్ , కృష్ణ జన్మాష్టమితో సహా అనేక పవిత్రమైన పండుగలు ఆగస్టులో జరుపుకోనున్నారు. కనుక ఆగష్టు నెల హిందువులకు ముఖ్యమైన నెల కానుంది. శ్రావణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే నాగ పంచమి వ్రతంతో ఈ నెల ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి తో ముగియనుంది. అయితే ఈఏడాది కృష్ణాష్టమి మిగులు తగులు రూపంలో రెండు రోజులు రావడం విశేషం..
ఆగస్ట్ 2022 నెలలో పండుగల పూర్తి జాబితా:
ఆగస్టు 2: నాగ పంచమి ఆగస్టు 4: తులసీదాస్ జయంతి ఆగస్టు 5: శ్రీ దుర్గాష్టమి ఉపవాసం ఆగస్టు 8: శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 9: ప్రదోష ఉపవాసం ఆగస్టు 11: శ్రావణ పూర్ణిమ, రక్షా బంధన్, జంధ్యాల పౌర్ణమి ఆగస్టు 12: వరలక్ష్మీ వ్రతం ఆగస్ట్ 14: కజారీ తీజ్ వ్రతం ఆగస్ట్ 15: స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 18 , 19: కృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ 23: అజ ఏకాదశి ఆగస్టు 31: వినాయక చవితి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి