Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారు సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం..
ఈ రోజు తమకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. దీంతో తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 30వ తేదీ ) శనివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
Horoscope Today (30-07-2022): ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఏ రంగంలో ఉన్నవారైనా సరే.. రోజులో కొత్త పనులు మొదలు పెట్టాలన్నా. ఎక్కడివెళ్లాలన్నా.. రోజులో మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. దీంతో తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 30వ తేదీ ) శనివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. తగిన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. గోవుని సేవించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. స్థిర నిర్ణయాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మానసికంగా సంతోషంగా గడుపుతారు. .
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అధిక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖమైన పనులను ప్రారంభించండి. ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారు సొంత ఇల్లు కల నెరవేర్చేదిశగా అడుగు వేస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధన లాభం ఉంది. సంతోషం కలిగించే వార్త వింటారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు అపోహలతో సమయాన్ని వృధా చేయకండి. ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. శుభవార్త వింటారు. ఆత్మీయులతో కలిసి సంతోషముగా గడుపుతారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి కీలక విషయాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అందరిని కలుపుకుని వెళ్లడంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాల వలన లభిస్తాయి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలోని వారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. అనవసరం వాదనలకు దూరంగా ఉండడం మేలు. కీలక వ్యవహారాల్లో ఆందోళన పడటం తగ్గించుకుంటే మంచిది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కీలక విషయాల్లో సరైన నిర్ణయం తీసుకుని పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో విజయాన్ని సొంతం చేసుకుంటారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు పట్టుదలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారు శుభ ఫలితాలను అందుకుంటారు. ఇతరుల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)