Viral Video: రాత్రివేళ బైక్ పై ప్రయాణం.. ఎదురుగా తెల్ల చీర కట్టుకుని నిలబడ్డ దెయ్యం.. అంతే
దెయ్యాలు ఉన్నాయా.. ఇది అంతు చిక్కని ప్రశ్న. ఉన్నాయని కొందరంటే లేవని మరికొందరు చెబుతారు. దేవుడు ఉంటే కచ్చితంగా దెయ్యం ఉంటుందని పలువురు కుండబద్ధలు కొడుతూ ఉంటారు. సరే.. ఆ విషయాన్ని వదిలేద్దాం. మీరు ఎప్పుడైనా చీకటిలో, అడవిలో...
దెయ్యాలు ఉన్నాయా.. ఇది అంతు చిక్కని ప్రశ్న. ఉన్నాయని కొందరంటే లేవని మరికొందరు చెబుతారు. దేవుడు ఉంటే కచ్చితంగా దెయ్యం ఉంటుందని పలువురు కుండబద్ధలు కొడుతూ ఉంటారు. సరే.. ఆ విషయాన్ని వదిలేద్దాం. మీరు ఎప్పుడైనా చీకటిలో, అడవిలో బైక్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లారా. చుట్టూ చిమ్మ చీకటి, జంతువులు, కీటకాల అరుపులు, నిశ్శబ్ధ వాతావరణం మనల్ని ఓ రకమైన అనుభూతికి గురి చేస్తుంది. అలా వెళ్లేటప్పుడు ఎదురుగా దెయ్యం ఎదురైతే.. పై ప్రాణాలు పైనే పోతాయి కదా. సరిగ్గా ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాత్రి వేళల్లో తాము ప్రయాణించేటప్పుడు దెయ్యాలను చూసినట్లు కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ అలాంటి సంఘటనే మనకు ఎదురైతే.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మార్గమధ్యలో తెల్ల చీర కట్టుకుని దెయ్యం లాంటి ఆకారం కనిపిస్తుంది. యువకులు భయాందోళనకు గురై.. బైక్ వేగం పెంచుతారు. అలా స్పీడ్ గా వెళ్లాక వారికి ఎదురుగా అదే దెయ్యం కనిపిస్తుంది. ఈ ఘటనతో వారు భయంతో వణికిపోతారు. వెనక్కు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయింది. అయితే ఇది ముందస్తు ప్లాన్ ప్రకారం చేశారు. దెయ్యం గెటప్ వేసుకున్న ఓ వ్యక్తి భయపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. అది తెలియకు బైక్ పై ప్రయాణిస్తున్న వారు వణికిపోతారు. ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో మమ్మల్ని చాలా భయపెట్టిందని సరదా కామెంట్లు రాస్తున్నారు.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇవ్వబడింది. దెయ్యాలున్నాయన్న ప్రచారాన్ని TV9 తెలుగు ధృవీకరించదు. అలాగే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించలరు)