AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Love Story: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. అమెరికా అమ్మాయితో తెలుగబ్బాయి పెళ్లి

ఇద్దరి మధ్య స్నేహంకాస్త ప్రేమగా మారింది. కొంతకాలం నుండి ప్రేమించుకుంటున్న అరవింద్ - జెన్నా... వారి ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు..

Interesting Love Story: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. అమెరికా అమ్మాయితో తెలుగబ్బాయి పెళ్లి
Wedding
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2022 | 12:13 PM

Share

Indian Boy Marries American Girl:  వారి మధ్య స్నేహాం కాస్తా ప్రేమగా మారింది.. ఖండంతరాలు దాటిన ఆ ప్రేమకు పెద్దల ఆంగీకారం తోడైంది.. ఇంకేముంది మూడు ముళ్ల బందంతో ఆ జంట ఒక్కటైంది. అమెరికా అమ్మాయి & వరంగల్ అబ్బాయి ప్రేమపెళ్లి ఇరువురి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్తజంటను ఆశీర్వాదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వరంగల్ కు చెందిన అరవింద్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ చదువుకుంటున్న క్రమంలో జెన్న అనే క్లాస్ మెట్ తో స్నేహం ఏర్పడింది..ఇద్దరి మధ్య స్నేహంకాస్త ప్రేమగా మారింది. కొంతకాలం నుండి ప్రేమించుకుంటున్న అరవింద్ – జెన్నా… వారి ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.. ఇరువురి పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు.. ఇంకేముందీ ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమ.. పెళ్లి బంధంతో ఒక్కటయింది.

ఆదివారం హనుమకొండలో వీరి కళ్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది.. అమెరికా నుండి జెన్నా తల్లిదండ్రులు వరంగల్ కు రావటంతో అంగరంగ వైభవంగా పెళ్లి హైందవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకకు మంత్రి దయాకర్ రావు తో పాటు,.పలువురు బంధుమిత్రులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి