Major accident:ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌కి కరెంట్ షాక్.. 10మంది మృతి

జరిగిన ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. వాహనంలోని డీజే సిస్టం కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ కారణంగానే..

Major accident:ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌కి కరెంట్ షాక్.. 10మంది మృతి
West Bengal
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 01, 2022 | 10:49 AM

Major accident: రన్నింగ్‌లో ఉన్న పికప్ వ్యాన్‌‌ కరెంట్ షాక్‌కు గురవడంతో ఏకంగా పది మంది మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో గత అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కులో విద్యుదాఘాతం కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన 16 మందిని మరింత మెరుగైన చికిత్స కోసం జల్పాయ్‌గురి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పదిమంది మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

జరిగిన ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. వాహనంలోని డీజే సిస్టం కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ కారణంగానే విద్యుదాఘాతం సంభవించినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. మేఖ్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధార్లా బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగినట్టు మఠభంగ అడిషనల్ ఎస్పీ అమిత్ వర్మ తెలిపారు. కన్వారియాలందరూ శీతల్‌కుచి పోలీస్ పరిధిలోని ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేశామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి