మరోమారు అదే సీన్‌..! తల్లి మృతదేహంతో బైక్‌పై 80కి.మీ.. ఎవరి నిర్లక్ష్యం..!

ఆ తల్లి మృతదేహాన్ని మోటారు సైకిల్ కు కట్టి తీసుకెళ్లారు. స్థానికులు కొందరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

మరోమారు అదే సీన్‌..! తల్లి మృతదేహంతో బైక్‌పై 80కి.మీ.. ఎవరి నిర్లక్ష్యం..!
Mother Dead Body
Jyothi Gadda

|

Aug 01, 2022 | 1:23 PM

మరోమారు అదే సీన్‌ రిపీట్‌ అయింది. మానవత్వమా నీవెక్కడా మనల్ని మనమే ప్రశ్నించుకునే దుస్థితి ఏర్పడింది. కొడుకు మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన ఆ తండ్రి వేదన ఇంకా మన కళ్లముందే కదలాడుతోంది. భార్య శవంతో కాలినడక ఇంటికి చేరిన ఓ భర్త రోదన ఇంకా వెంటాడుతూనే ఉంది. అలాంటి ఘటనే మరోమారు నెటిజన్లను కంటతడిపెట్టిస్తోంది. ఓ వైపు తల్లిపోయిందనే పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆ కొడుకులకు అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవటం మరింత ఆవేదన మిగిల్చింది. తల్లి మృతదేహాన్ని తరలించేందుకు వాహనం దొరక్క టూవీలర్‌పైనే తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌ వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చేరటంతో మరింత వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌ వైద్య సిబ్బంది, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. ఇటీవలే సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన కలకలం రేపింది. తాజాగా మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో చనిపోయిన ఓ తల్లి మృతదేహానికి వాహనాన్ని సమకూర్చకపోవడం అక్కడి ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. దీంతో చేసేదేం లేక చనిపోయిన తల్లి మృతదేహన్ని వారి బైక్‌కు కట్టి 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి తరలించారు. ప్రైవేటు వాహనంలో తరలించేందుకు ప్రయత్నించగా వారు రూ. 5000 అడిగారు. అంత మొత్తాన్ని చెల్లించుకోలేని స్థితిలో ఉన్న ఆ కుమారులు.. చివరికి తన బైక్ పైనే.. ఆ తల్లి పార్థివ దేహాన్ని తీసుకొని స్వగ్రామం గుడారుకు వెళ్లారు. ఇందుకోసం రూ.100 పెట్టి చెక్క పలకలు కొని… దానిపై ఆ తల్లి మృతదేహాన్ని మోటారు సైకిల్ కు కట్టి తీసుకెళ్లారు. స్థానికులు కొందరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

కాగా, అనుప్పూర్‌లోని గుడారు గ్రామానికి చెందిన జైమంత్రి యాదవ్‌కు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు షాదోల్‌ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. మహిళ పరిస్థితి మెరుగుపడకపోవడంతో శనివారం రాత్రి 11 గంటలకు వైద్య కళాశాలకు రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2.40 గంటలకు ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

సరైన సమయంలో వైద్యం అందకపోవడంతోనే తమ తల్లి చనిపోయిందని వారు వాపోయారు. కనీసం ఆమె మృతదేహాన్ని తరలించడానికి కూడా వాహనాన్ని ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu