Letter to PM Modi: మోడీ జీ.. పెన్సిల్, ఎరేజర్ ధరలు పెరిగిపోయాయి.. ప్రధానికి చిన్నారి లెటర్

"మోడీ జీ.. నా పేరు కృతి దూబే. యూపీలోని కన్నౌజ్ ఛిబ్రమౌ పట్టణంలో అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నాను నేను ఒకటో తరగతి చదువుతున్నాను. మీరు ధరలు పెంచేస్తున్నారు. నేను ఉపయోగించే..

Letter to PM Modi: మోడీ జీ.. పెన్సిల్, ఎరేజర్ ధరలు పెరిగిపోయాయి.. ప్రధానికి చిన్నారి లెటర్
Child Wrote Letter To Pm Modi
Follow us
Ganesh Mudavath

| Edited By: Team Veegam

Updated on: Aug 01, 2022 | 2:40 PM

“మోడీ జీ.. నా పేరు కృతి దూబే. యూపీలోని కన్నౌజ్ ఛిబ్రమౌ పట్టణంలో అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నాను నేను ఒకటో తరగతి చదువుతున్నాను. మీరు ధరలు పెంచేస్తున్నారు. నేను ఉపయోగించే పెన్సిల్, ఎరేసర్ కాస్ట్ లీ అయ్యాయి. వీటిని పోగొట్టుకుంటే అమ్మ తిడుతోంది. కొన్ని సార్లు నన్ను కొట్టింది. పెన్సిల్ (Pencil), ఎరేజర్ ను క్లాస్ లో ఎవరైనా దొంగతనం చేసినా అమ్మ నన్ను కొడుతోంది. ఈ విషయంలో నేనేమీ చేయగలను. మ్యాగీ ధర కూడా బాగా పెరిగింది.” ఇదీ.. ధరల పెరుగుదలపై ఓ చిన్నారి ప్రధాని మోదీకి రాసిన లేఖలోని సారాంశం. ప్రస్తుతం అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఉప్పు, పప్పులు, నూనె, పాలు, పెరుగు.. ఇలా ఏ వస్తువైనా భగ్గున మండుతోంది. అంతే కాకుండా జీఎస్టీ పైనా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పాలు, పెరుగు, పాల ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకురావటం తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో పెన్సిల్ పోగొట్టుకున్నందుకు చిన్నారిని తన తల్లి కొట్టిందని ఒకటో తరగతి విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.

గతంలో పెన్సిల్ పోగొట్టుకున్నా అమ్మ ఏమీ అనలేదని, కానీ ఇప్పుడు మాత్రం తిట్టడంతో పాటు కొట్టిందని వాపోయింది. దీనికి కారణం ఏంటని ఆలోచిస్తే ధరలు పెరగడమే కారణమని తెలుసుకుంది. వెంటనే హిందీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేరుగా లేఖ రాసింది. తన పేరు కృతీ దూబేనని.. తాను ఒకటో తరగతి చదువుతున్నట్లుగా పేర్కొంది. తాను పడుతున్న అవస్థలను వివరించింది. ప్రస్తుతం ఈ లెట్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు ఎదురైన కష్టంపై ప్రధాని మోడీకి లేఖ రాసిన కృతి దూబే అందరి దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి