AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjay Raut: అమ్మను ఆలింగనం చేసుకుని.. పాదాలకు నమస్కరించి.. అరెస్టుకు ముందు భావోద్వేగ దృశ్యాలు

పత్రాచల్‌ కుంభకోణం కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut).. అరెస్టు కాకముందు కుటుంబసభ్యులతో గడిపిన తీరు భావోద్వేగానికి గురి చేస్తోంది. ఈడీ అధికారులు అరెస్టు చేయకముందు ఆయన తన తల్లి, కూతురిని హత్తుకుని కన్నీరు పెట్టారు....

Sanjay Raut: అమ్మను ఆలింగనం చేసుకుని.. పాదాలకు నమస్కరించి.. అరెస్టుకు ముందు భావోద్వేగ దృశ్యాలు
Sanjay Raut Ed Raid
Ganesh Mudavath
|

Updated on: Aug 01, 2022 | 1:48 PM

Share

పత్రాచల్‌ కుంభకోణం కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut).. అరెస్టు కాకముందు కుటుంబసభ్యులతో గడిపిన తీరు భావోద్వేగానికి గురి చేస్తోంది. ఈడీ అధికారులు అరెస్టు చేయకముందు ఆయన తన తల్లి, కూతురిని హత్తుకుని కన్నీరు పెట్టారు. అంతే కాకుండా వారికి జాగ్రత్తలు చెప్పారు. అనంతరం సంజయ్ రౌత్ బయటకు వెళ్తుండగా రౌత్ తల్లి హారతి ఇచ్చి తిలకం దిద్దారు. ఆయనమో తల్లి పాదాలకు నమస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా.. పత్రాచల్ ల్యాండ్‌ స్కాం కేసులో ఈడీ అధికారులు సంజయ్ రౌత్ ను నిన్న (ఆదివారం) అరెస్టు చేశారు. అనంతరం ముంబైలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనను ఇవాళ ( సోమవారం ) కోర్టు ముందు హాజరుపరుస్తామని వెల్లడించారు. అయితే.. రూ.1,034 కోట్లు పత్రాచాల్‌ భూ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ అనేక సార్లు సంజయ్‌ రౌత్‌కు నోటీసులు పంపింది. జూన్‌ 28న మొదటిసారి సమన్లు జారీ చేయగా.. ఒకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా ఇచ్చిన సమన్లను సంజయ్ రౌత్ పట్టించుకోలేదు. పార్లమెంట్‌ సమావేశాలను కారణంగా చూపి, ఆయన విచారణకు వెళ్లలేదు. ఈ సమయంలోనే ఆయన అరెస్టు అవడం మహారాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది.

మరోవైపు.. మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా, ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అవడం చకచకా జరిగిపోయాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ అరెస్టు అవడం హాట్ టాపిక్ గా మారింది. తమ పోరాటాన్ని ఆపేందుకు కుట్ర జరుగుతోందని, బీజేపీ చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారి సమన్లు అందించిందని మద్దతు దారులు తీవ్రంగా స్పందించారు.

ఆదివారం చేసిన సోదాల్లో సంజయ్ రౌత్ ఇంట్లో అధికారులు రూ.11.50 లక్షలు సీజ్ చేశారు. అందులో రూ.10 లక్షలను ప్రత్యేకంగా ఒక కవర్‌లో ఉంచినట్లు గుర్తించారు. ఆ కవర్‌పై ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే పేరు రాసి ఉంచినట్లు సమాచారం. కాగా ఇవాళ (సోమవారం) సంజయ్ రౌత్ పీఎంఎల్‌ఏ కోర్టుకు తీసుకెళ్లనున్నారు. అంతేకాకుండా ఈ కేసు విచారణ కోసం ఈడీ సంజయ్ ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని అడగనుంది. సంజయ్ రౌత్ అరెస్టును ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తాము సంజయ్ పక్షానే ఉంటామని స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు