Noida: ఇంటి గేటు కూలింది.. కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ను మింగేసింది

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సమీపంలోని నోయిడా (Noida) లో విషాదం చోటు చేసుకుంది. భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న గేటు ఓ సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసింది. గేటులో ఏర్పడిన చిన్న సమస్య ప్రాణాలే బలిగొంది. గేటు మూస్తున్న సమయంలో అదుపుతప్పి...

Noida: ఇంటి గేటు కూలింది.. కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ను మింగేసింది
Gate
Follow us

|

Updated on: Aug 01, 2022 | 1:29 PM

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సమీపంలోని నోయిడా (Noida) లో విషాదం చోటు చేసుకుంది. భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న గేటు ఓ సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసింది. గేటులో ఏర్పడిన చిన్న సమస్య ప్రాణాలే బలిగొంది. గేటు మూస్తున్న సమయంలో అదుపుతప్పి అమాంతం సెక్యూరిటీ గార్డుపై పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నోయిడాలోని ఓ సొసైటీలో సెక్టార్ 78లోని సిక్కా కర్మిక్ గ్రీన్స్ సొసైటీలో రామ్‌హిత్ అనే సెక్యూరిటీ గార్డు విధులు నిర్వరిస్తున్నాడు. రోజూ గేటు వద్ద నిలబడి పహారా కాయడం అతని పని. కాగా కొద్ది రోజులుగా సౌసైటీ మెయిన్ గేటు స్లైడింగ్ సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో సెక్యూరిటీ గార్డు గేటు తీసేందుకు, మూసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో గేటును మూస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ పెద్దగేటు అతనిపై పడింది. ఊహించని ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సెక్యూరిటీ గార్డును ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్లైడింగ్ అలైన్ మెంట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి