AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. భారీ చెట్టును వాటేసుకున్న కొండచిలువ.. ఎందుకో టెక్నిక్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!!

కొండచిలువ..చెట్టు ఎక్కుతూ కనిపించిన వీడియో చూస్తే మీకూ ముచ్చెమటలు పడతాయి. వైరల్ అవుతున్న వీడియోలో కొండచిలువ మొదట..

Viral Video: వామ్మో.. భారీ చెట్టును వాటేసుకున్న కొండచిలువ.. ఎందుకో టెక్నిక్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!!
Massive Python
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2022 | 10:09 AM

Share

Viral Video:  ఎప్పుడో ఒకప్పుడు పాము నేలపై పాకడం మీరు చూసే ఉంటారు..నిజానికి ఈ జీవులు క్రాల్ చేసే వేగాన్ని చూస్తే గుండెకొట్టుకునే వేగం అమాంతం పెరిగిపోతుంది. అయితే పాములు చెట్లు ఎక్కడం ఎప్పుడైనా చూశారా? మీరు చూడకపోతే, ఇప్పుడు చూడండి. ప్రస్తుతం, కొండచిలువకు సంబంధించిన ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అందులో చెట్టు ఎక్కడానికి ప్రత్యేక టెక్నిక్‌ని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే వీడియోలో ఉన్న ఈ కొండచిలువ చెట్టుపైకి ఎక్కుతున్న వేగం చూస్తే మీరు షాక్ అవుతారు.

కొండచిలువను చూడగానే ఎవరికైనా సరే..భయంతో వణుకుపుడుతుంది. ఎవరినైనా పట్టుకుంటే నిముషాల్లో తన పని అంతా చేసుకుపోతుందని దాని పట్టు చాలా బలంగా ఉందని అంటున్నారు. అయితే, ఇది చాలా బరువైన పాము కాబట్టి అది నేలపై తగినంత వేగంగా క్రాల్ చేయలేదు. అయితే అలాంటి కొండచిలువ..చెట్టు ఎక్కుతూ కనిపించిన వీడియో చూస్తే మీకూ ముచ్చెమటలు పడతాయి. వైరల్ అవుతున్న వీడియోలో కొండచిలువ మొదట చెట్టు మొదలను పట్టుకుంటుంది.. ఆపై వేగంగా పైకి కదులుతున్నట్లు మీరు చూడవచ్చు. దీని తర్వాత, మళ్లీ మళ్లీ అదే ప్రక్రియ చేస్తూ చెట్టు ఎక్కుతుంది. అయితే కొండచిలువ చెట్టు ఎక్కే ఈ పద్ధతిని చూస్తే మీరు కూడా భయపడిపోతారు. కొండచిలువ చాలా త్వరగా చెట్టు ఎక్కినట్లు కనిపిస్తుంది. కొండచిలువ చెట్టుపైకి ఎక్కిన ఈ షాకింగ్‌ వీడియో @LeonyMerks హ్యాండిల్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. ఇది రెటిక్యులేటెడ్ పైథాన్, ఇది భూమిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం, ఈ జాతికి చెందిన పైథాన్‌ల గరిష్ట పొడవు 32 అడుగుల వరకు ఉంటుంది. ఇది మనుషులను కూడా మింగేస్తుంది. ఈ పైథాన్ జాతి దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది.

కేవలం 20 సెకన్ల ఈ క్లిప్‌ని చూసి సోషల్ మీడియా యూజర్లు చాలా ఆశ్చర్యపోయారు. వీడియో చూసిషాక్‌ అయినట్టు కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'జోన్ జీరో' అంటే ఏమిటి? తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం ఇలా!
'జోన్ జీరో' అంటే ఏమిటి? తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం ఇలా!
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?