Dragon Fruit: కోనసీమలో డ్రాగన్ ఫ్రూట్స్‌ దిగుబడి.. దైవ సుబ్రహ్మణ్యం తోటలో అంతర్‌ పంట

కోనసీమలో డ్రాగన్ ఫ్రూట్ పండించడానికి అనుకూలమైన వాతావరణమని, పైగా ఈ చెట్లకు చీడ పీడ,పశువులు ఎలుకలు బెడద లేదన్నారు. పురుగుల మందు ఎరువులు ఖర్చు లేదని...

Dragon Fruit: కోనసీమలో డ్రాగన్ ఫ్రూట్స్‌ దిగుబడి.. దైవ సుబ్రహ్మణ్యం తోటలో అంతర్‌ పంట
Dragon Fruit
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 01, 2022 | 9:08 AM

Dragon Fruit: తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు విస్తరిస్తోంది. ఔషధ గుణాలు మెండుగా కలిగిన పండు కావడానికితోడు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుపై దృష్టి సారిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ అంటెనే చైనాకు కేర్ ఆఫ్ అడ్రస్. చైనాలోనే కాదు కోనసీమలో పండిచవచ్చు అని నిరూపించాడు తాటిపాక phc ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న దైవపు సుబ్రహ్మణ్యం. రాజోలు మండలం చింతలపల్లి లో తనకు ఉన్న రెండు కుంచాలు భూమిలో 40 మొక్కలను సాగుచేశాడు. కడియం నర్సరీలో మొక్కలు కొనుగోలు చేసి,.. ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రారంభించారు. పశువుల ఎరువులతో, సేంద్రియ కంపోస్టులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి సాధించవచ్చు అంటున్నారు దైవ సుబ్రహ్మణ్యం.

రెండు సంవత్సరాల క్రితం మొక్కలు నాటినట్టుగా చెప్పారు. ఇప్పటికీ రెండు క్రాపులు వచ్చిందన్నారు.. కొబ్బరి తోటలో అంతర్ పంటగా డ్రాగన్ ఫ్రూట్ పండించవచ్చని ఒక్కసారి ఈ మొక్కలు నాటితే 30 ఏళ్ల వరకు ఫలాలను అందిస్తుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. కోనసీమలో డ్రాగన్ ఫ్రూట్ పండించడానికి అనుకూలమైన వాతావరణమని 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమని చెబుతున్నారు. ఈ చెట్లకు చీడ పీడ,పశువులు ఎలుకలు బెడద లేదన్నారు. పురుగుల మందు ఎరువులు ఖర్చు లేదని. ఒక్క చీమలు బెడద ఉంటుందని దానికి చీమల మందు వాడితే సరిపోతుందన్నారు. ఈ పండులో పోషక విలువలు, ఔషధ గుణాలు అధికంగా ఉండటంతో సంపూర్ణ ఆరోగ్యం కోసం డ్రాగన్‌ ఫ్రూట్స్‌ తినాలని సూచిస్తున్నారు. షుగర్, బీపీ, ఆర్థరైటిస్, ఆస్తమా వంటి రోగాలు దూరం చేసుకోవచ్చని సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..