AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minor Girl Kidnapped: అక్క కాపురానికి రావడం లేదని చెల్లిని కిడ్నాప్ చేసిన బావ..! హనుమకొండలో కలకలం..

హైదరాబాద్ హైవే రూట్‌లో బాలికను బైక్‌పై ఎక్కించుకుని వెళ్తున్నట్టుగా ఉన్న దృశ్యాలు టోల్‌గేట్ వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే, అక్క మీద కోపంతో..

Minor Girl Kidnapped: అక్క కాపురానికి రావడం లేదని చెల్లిని కిడ్నాప్ చేసిన బావ..! హనుమకొండలో కలకలం..
Girl Kidnaped
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2022 | 1:48 PM

Share

Minor Girl Kidnapped: హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావటం లేదనే అక్కసుతో ఓ భర్త ఎవరూ ఊహించని పనిచేశాడు. తన భార్యపై కోపంతో ఆమె చెల్లిలిని కిడ్నాప్‌ చేసినట్టుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలిక ఆచూకీ లభించకపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాలిక తల్లి హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. 20 రోజుల క్రితం అదృశ్యమైన బాలిక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే..

హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన మైనర్‌ బాలిక సిరి(15) బాలిక కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. అక్క కాపురానికి రావడం లేదని అక్కసుతో బావ మధు (అక్క భర్త)చెల్లిని కిడ్నాప్ చేసినట్టుగా సిరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 20 రోజుల క్రితం అదృశ్యమైన బాలిక ఆచూకీ కనిపెట్టాలంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక కనిపించకుండా పోయిన రోజు నుంచి బావ మధు.. ఆమెను స్కూల్ వద్ద నుంచి తీసుకెళ్లాడు. బాలిక కనిపించకుండా పోయిన తర్వాత అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్కూల్ నుండి బాలిక బావ మధు ఆమెను బైక్ పై తీసుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. వరంగల్- హైదరాబాద్ హైవే రూట్‌లో బాలికను బైక్‌పై ఎక్కించుకుని వెళ్తున్నట్టుగా ఉన్న దృశ్యాలు టోల్‌గేట్ వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే, అక్క మీద కోపంతో చెల్లిని హతమార్చి వుంటాడని బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల నుండి బాలిక ఆచూకీ లభించక పోవడంతో పోలీసులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాజీపేట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?