Andhra Pradesh: పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొడతున్నారు.. మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై (Chandrababu) మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలపై చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన సాయం...

Andhra Pradesh: పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొడతున్నారు.. మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్
Ambati Rambabu
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 30, 2022 | 8:10 PM

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై (Chandrababu) మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలపై చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన సాయం చూడలేక రగిలిపోతున్నారని మండిపడ్డారు. వరదల సమయంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందన్న అంబటి.. వరద సహాయం అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే ప్రజల వద్దకు వెళ్లారని చెప్పారు. వరదలతో భారీ నష్టం జరిగిందని, అనేక మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన సహాయం, చర్యలపై ముంపు బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారని.. కానీ చంద్రబాబు మాత్రం చూసి తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి (Minister Ambati Rambabu) విమర్శించారు. 1983 లో భద్రాచలంలో కరకట్టానని చెబుతున్న చంద్రబాబు.. ఆ సమయంలో అసలు టీడీపీలో ఉన్నారా అని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టే ప్రభుత్వం అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక చంద్రబాబు జీవితమంతా రోడ్లపై తిరగడమేనని.. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏం చేశారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

కాగా.. వైసీపీ పాలనపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్ స్విచ్ బంద్ చేసి, సైకిల్ కు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అలా చేస్తేనే పోలవరం నిర్వాసితులకు, వరద బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి, శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన వారికి సహాయం చేయాలని దాతలను చంద్రబాబునాయుడు కోరారు. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మంతా వరదల్లో కొట్టుకుపోయిందని, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో సహాయం కోసం అర్థిస్తున్నారని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..