Maharashtra: వారికి గుణపాఠం చెప్పే సత్తా ప్రజలకు ఉంది.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సెన్సేషనల్ కామెంట్స్

బీజేపీపై (BJP) ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్‌లో ఆధిక్యాన్ని చూసుకుని మిడిసిపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి గుణపాఠం చెప్పగలిగే సత్తా ప్రజలకు ఉందని హెచ్చరించారు. రాష్ట్రపతి పదవిపై...

Maharashtra: వారికి గుణపాఠం చెప్పే సత్తా ప్రజలకు ఉంది.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సెన్సేషనల్ కామెంట్స్
Sharad Pawar
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 31, 2022 | 7:53 AM

బీజేపీపై (BJP) ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్‌లో ఆధిక్యాన్ని చూసుకుని మిడిసిపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి గుణపాఠం చెప్పగలిగే సత్తా ప్రజలకు ఉందని హెచ్చరించారు. రాష్ట్రపతి పదవిపై కాంగ్రెస్‌ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ అంశాన్ని ఉద్దేశించి.. పవార్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. బ్రిటీష్ సామ్రాజ్యంలో రవి అస్తమించడు అనేదనేది ఒక పురాణ గాథ ఉండేదన్న పవార్ (Pawar) సామాన్య ప్రజలు ఏకమవడంతో ఆ సామ్రాజ్యం కూలిపోయిందని వివరించారు. రాష్ట్రపతి పదవిని ఉద్దేశించి ఓ ఎంపీ తప్పుపదం వాడారని కానీ తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. అయితే బీజేపీ మాత్రం సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిందన్నారు. ఆమెను ఇబ్బందికి గురి చేశారని.. కానీ తమ పార్టీ ఎంపీ సుప్రియా సూలే సోనియాను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని చెప్పారు. కాగా.. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతి పదవిపై చేసిన పదాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఆయన, సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే అధిర్ క్షమాపణలు చెప్పారు.

గతంలోనూ తీవ్ర ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయాలపై శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం మరో ఆరు నెలల్లో కూలిపోతుందని జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని, షిండే – బీజేపీ కూటమి సర్కారు ఎన్నో రోజులు అధికారంలో ఉండబోదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల షిండే వర్గంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు శరద్ పవార్ ఆ సమావేశంలో అన్నట్లు ఓ ఎన్సీపీ నేత మీడియాకు తెలిపారు. మరో ఆరు మాసాల్లో ఇదంతా జరుగుతుందని ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..