Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదల బీభత్సం.. విరిగిపడుతున్న కొండచరియలు.. గంగోత్రి హైవేపై రాకపోకలు బంద్

వరద ప్రవాహం ఉధృతికి బద్రీనాథ్‌ నేషనల్‌ హైవే 7లో కొంత పార్ట్‌ కొట్టుకుపోయింది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైవేకి రెండు వైపులా యాత్రికులు చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి తాడు సాయంతో యాత్రికులను తలించారు.

Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదల బీభత్సం.. విరిగిపడుతున్న కొండచరియలు.. గంగోత్రి హైవేపై రాకపోకలు బంద్
Uttarakhand Rains
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2022 | 7:46 AM

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో  వర్షాల, వరదల బీభత్సం కొనాగుతూనే ఉంది.  రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. డెహ్రాడూన్, నైనిటాల్, టెహ్రీ, పౌరి, చంపావత్, బాగేశ్వర్‌ తదితర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. లంబాగడ్‌ వద్ద కచ్చా డ్రెయిన్‌లో వరద ప్రవాహం ఉధృతికి బద్రీనాథ్‌ నేషనల్‌ హైవే 7లో కొంత పార్ట్‌ కొట్టుకుపోయింది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైవేకి రెండు వైపులా యాత్రికులు చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి తాడు సాయంతో యాత్రికులను తలించారు. ఒక్కసారిగా పోటెత్తిన వరద ప్రవాహంలో కొండల పైనుంచి బండరాళ్లు కొట్టుకువచ్చాయి.

భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో గంగోత్రి హైవేపై రాకపోకలను నిలిపివేశారు. మరికొన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. రూరల్‌ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి అనేక రోడ్లు బ్లాక్‌ అయ్యాయి. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో కూడా కుండపోత వాన కురిసింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రానున్న 48 గంటలపాటు ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం డెహ్రాడూన్, నైనిటాల్, టెహ్రీ, పౌరీ, చంపావత్, చమోలి, పితోర్‌గఢ్, బాగేశ్వర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ నెల మొదట్లో కూడా ఉత్తరాఖండ్‌లో ఇదే పరిస్థితి తలెత్తింది. బద్రీనాథ్ – కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో చార్‌ధామ్ యాత్ర మార్గాన్ని మళ్లించవలసి వచ్చింది.

ఇవి కూడా చదవండి

శుక్రవారం తెల్లవారుజామున నైనిటాల్‌లోని నైనిటాల్ భోవాలి రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. “రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీనిని పునరుద్ధరించడానికి కనీసం ఒక వారం పడుతుంది” అని నైనిటాల్ DM ధీరజ్ సింగ్ గార్బియాల్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..