Drunk Teacher: ఫుల్ గా మందు కొట్టి స్కూల్ కి వచ్చిన లేడీ టీచర్.. నేలపై సృహ తప్పి పడిఉన్న టీచర్ ను చూసి అధికారుల షాక్
ఛత్తీస్‌గఢ్‌లో టీచర్లు తాగి క్లాసులో కనిపించడం గత కొంతకాలంగా సర్వసాధారణంగా మారింది. అయితే ఒక మహిళ ఇలా స్కూల్ కు తాగి రావడం ఇదే మొదటిసారి.
Drunk Teacher: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ.. వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పుతున్నారు. గత కొంతకాలంగా తాగొచ్చి ఉపాధ్యాయులు అరాచకాల గురించి విన్నాం.. ఇందుకు భిన్నగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు మద్యం సేవించి స్కూల్‌కు వచ్చింది. స్కూల్ తనిఖీకి వచ్చిన విద్యాశాఖ అధికారి ఆమెను ఆ స్థితిలో చూసి షాకయ్యారు. ఒక మహిళా ఉపాధ్యాయురాలు తాగి స్కూల్ కు వచ్చి మతి కోల్పోయి.. తరగతి గది నేలపై పడుకుని ఉంది. దీంతో విద్యార్థులు ఆమె చుట్టూ చేరి ఆడుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో టీచర్లు తాగి క్లాసులో కనిపించడం గత కొంతకాలంగా సర్వసాధారణంగా మారింది. అయితే ఒక మహిళ ఇలా స్కూల్ కు తాగి రావడం ఇదే మొదటిసారి. రాయ్‌పూర్‌కు 430కిమీ దూరంలోని జష్‌పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ శివార్లలోని టికైత్‌గంజ్ ప్రాథమిక పాఠశాలలో ‘డ్రంకెన్ మాస్టర్’ మూమెంట్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
విద్యాశాఖ అధికారి సిద్ధిక్ రోటీన్ తనిఖీలో భాగంగా ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లారు. 3, 4 తరగతలను బోధించే లేడీ టీచర్ జగపతి భగత్ నేలపై పడుకుని ఉండటం చూసి ఖంగుతిన్నాడు. ఆమెకు ఆరోగ్యం బాగోలేదేమోనని తొలుత అనుకున్నారు. క్లాస్‌లో ఆడుకుంటున్న విద్యార్థులను అడగ్గా, టీచర్ తాగి వచ్చిందని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఆమె మద్యం సేవించి స్కూల్‌కు రావడంపై పలు ఫిర్యాదులు కూడా వచ్చాయి. విద్యాశాఖ అధికారి వెంటనే స్థానిక పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారు. సదరు మహిళా ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జూన్ 16న ప్రారంభమైన ఈ విద్యా సంవత్సరంలో జష్‌పూర్ జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. అందులో ముగ్గురు టీచర్లు మద్యం తాగి స్కూల్‌కు రావడం వల్లే వారిపై సస్పెన్షన్ వేటు పడటం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..