Viral News: అప్పటి వరకూ స్నానం చేయనని అసాధారణ ప్రతిజ్ఞ.. 22 ఏళ్లుగా స్నానం చేయని వ్యక్తి.. కారణం తెలిస్తే మీరు ఫిదా అవుతారు
ఓ వ్యక్తి మాత్రం.. గత 22 ఏళ్లుగా స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. ఇలా స్నానం చేయకుండా ఉండడానికి కూడా ఓ రీజన్ చెబుతున్నాడు ఆ వ్యక్తి.. ఆ కారణం తెలిస్తే కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తే.. మరికొందరు షాక్ తింటున్నారు.
Viral News: స్నానం చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే రోజూ రెండుపూటలా స్నానం చేసేవారు ఉన్నారు. కొందరు బద్దకంతో.. సెలవు రోజు స్నానం చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయినప్పటికీ బయటకు వెళ్లే సమయంలో దుర్వాసన వస్తుందంటూ.. వెంటనే స్నానం చేస్తారు. మరి అలాంటిది వారం రోజులు స్నానం చేయకపోతే.. ఒంటి నుంచి దుర్వాసన గుప్పుమంటుంది. కొన్ని సార్లు చర్మ వ్యాధులు కూడా వస్తాయి. అయితే కొన్ని ఆటవిక తెగల్లోని వారు మాత్రం.. జీవితంలో కొన్ని ముఖ్య సమయాల్లో మాత్రమే స్నానము చేసే ఆచారం ఉంది.. ఇక ఓ వ్యక్తి మాత్రం.. గత 22 ఏళ్లుగా స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. ఇలా స్నానం చేయకుండా ఉండడానికి కూడా ఓ రీజన్ చెబుతున్నాడు ఆ వ్యక్తి.. ఆ కారణం తెలిస్తే కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తే.. మరికొందరు షాక్ తింటున్నారు. ఈ వ్యక్తి బీహార్ కు చెందినవాడు. వివరాల్లోకి వెళ్తే..
బిహార్ లోని పాల్గంజ్ జిల్లా, బైకుంఠపుర్కు చెందిన 62 ఏళ్ల ధరమ్‌దేవ్ రామ్.. 2000 సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఈ విషయం గురించి తెలిసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ధరమ్ దేవ్ ఇన్ని ఏళ్లుగా స్నానం చేయకపోయినా.. అతని శరీరం నుంచి దుర్వాసన లేదు. ఎప్పుడూ అనారోగ్యబారిన పడలేదు. 22 ఏళ్ల క్రితం ధరమ్ దేవ్ 40 ఏళ్ల వయసులో తాను జీవితంలో స్నానం చేయనని అసాధారణమైన ప్రతిజ్ఞ చేశారు. ధరమ్‌దేవ్ రామ్ మహిళలపై నేరాలు, భూ వివాదాలు, జంతు వధలు అరికట్టే వరకు స్నానం చేయనని శబధం చేశారు.
స్నానం చేయడం వల్ల తన పని వృధా అవుతుందని అందువల్లనే స్నానం చేయడం లేదని చెప్పారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన ప్రతిజ్ఞకు కట్టుబడే ఉన్నారు ధరమ్‌దేవ్. 2003లో భార్య మాయాదేవి చనిపోయిన తర్వాత కూడా స్నానం చేయలేదు. తన ఇద్దరు అబ్బాయిలు చనిపోయిన తర్వాత కూడా వారి శరీరాలపై చుక్క నీరు పోలేదు. అతనికి కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. ఆశ్చర్యకరంగా.. ధరమ్‌దేవ్‌కు ఎప్పుడూ అనారోగ్యానికి గురికాలేదు.
ధరమ్‌దేవ్ రామ్”1975లో బెంగాల్ లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తుండేవాడు.. 1978లో వివాహం జరిగింది. 1987లో భూ తగాదాలు, జంతు వధలు, మహిళలపై నేరాలు పెరగడంపై తనకు అవగాహన వచ్చిందని ధరమ్‌దేవ్ తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఓ గురువుని ఆశ్రయించాడు ధరమ్‌దేవ్. 6 నెలలు గడిపిన అనంతరం.. అతడు అప్పటి నుంచి స్నానం చేయకూడదని నిశ్చయించుకున్నారు. ధర్మదేవుడు శ్రీరాముడిని ఆదర్శంగా భావించి ఆయన మాటలను గుర్తు చేసుకుంటూ జీవిస్తాడు. 22 ఏళ్ల నుంచి నుంచి స్నానం చేయకపోయినా ధరమ్‌దేవ్ ఆరోగ్యంగానే ఉండటం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..