AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Protest: ధరలు, నిరుద్యోగం పెరుగుదలపై కాంగ్రెస్ నిరసన గళం.. ఆగష్టు 5న రాష్ట్రపతి, గవర్నర్ల భవనాల ముట్టడి..

దేశవ్యాప్తంగా ఆగస్టు 5న భారీగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని పార్టీ నేతలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపై నిరసన గళం వినిపించేందుకు కాంగ్రెస్ ఎంపీలు చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు

Congress Protest: ధరలు, నిరుద్యోగం పెరుగుదలపై కాంగ్రెస్ నిరసన గళం.. ఆగష్టు 5న రాష్ట్రపతి, గవర్నర్ల భవనాల ముట్టడి..
Congress Protest
Surya Kala
|

Updated on: Jul 31, 2022 | 9:09 AM

Share

Congress Protest: దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న ధరలతో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదంటూ సామాన్య, మధ్యతరగతి వారు తీవ్ర ఆవేదన చెందుతారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, ఇలా ప్రతిదీ ధరలు పెరుగుతూనే ఉంది. దీనికి తోడు పెరుగుతున్నద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 5న భారీగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని పార్టీ నేతలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపై నిరసన గళం వినిపించేందుకు కాంగ్రెస్ ఎంపీలు చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ నుంచి  రాష్ట్రపతి భవన్ కు చేరుకొని అక్కడ నిరసన తెలపనున్నారని తెలిపింది. అనంతరం CWC సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు  ప్రధాని మోడీ నివాసానికి చేరుకుంది.. పీఎం హౌస్ ఘెరావ్’ నిరసన మార్చ్ నిర్వహించనున్నారని పేర్కొంది.

ఆయా రాష్ట్రాల్లో ‘రాజ్ భవన్ ఘెరావ్’ నిరసన ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ల నివాసాలను కాంగ్రెస్ నేతలు చుట్టుముట్టి నిరసన తెలుపుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు.

జూలై 18న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లో ధరలు, జీఎస్టీ అంశాన్ని కాంగ్రెస్ నేతలు లేవనెత్తాతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరుగుదలపైప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు తమ నిరసన గళం వినిపించారు. ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలుపుతున్నారు. దీంతో సభాకార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ.. వివిధ పార్టీలకు చెందిన ఉభయ సభల ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక లోక్‌సభలో సోమవారం ధరల పెరుగుదలపై చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. తర్వాత మంగళవారం రాజ్యసభలో చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ