Bandi Sanjay: ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత నేడే.. యాదాద్రి నుంచి ప్రారంభం.. హాజరుకానున్న కేంద్ర మంత్రులు

తెలంగాణలో (Telangana) ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రచిస్తోంది. అధికార ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను ఎండగడుతూనే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే విషయాలపై ప్రజలకు వివరిస్తున్నారు. ఈ...

Bandi Sanjay: ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత నేడే.. యాదాద్రి నుంచి ప్రారంభం.. హాజరుకానున్న కేంద్ర మంత్రులు
Bandi Sanjay
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 02, 2022 | 7:25 AM

తెలంగాణలో (Telangana) ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రచిస్తోంది. అధికార ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను ఎండగడుతూనే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే విషయాలపై ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే రెండు విడతలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న యాత్ర.. ఇవాళ (మంగళవారం) నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెడతారు. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో జరిగే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరవనున్నారు.

ఇవాళ ఉదయం 10 గంటలకు యాదాద్రికి చేరుకోనున్న బండి సంజయ్.. కేంద్రమంత్రులతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం 11 గంటలకు యాదగిరిపల్లి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం కేంద్రమంత్రి షెకావత్‌.. పార్టీ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభిస్తారు. యాదాద్రి నుంచి ప్రారంభమయ్యే యాత్ర జనగామ జిల్లా మీదుగా వరంగల్‌ చేరుకోనుంది. 24 రోజుల పాటు కొనసాగనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దర్శనంతో ముగియనుంది. ఇవాళ యాదగిరిపల్లి, గాంధీనగర్, యాదగిరిగుట్ట ప్రధాన రహదారి, గణేశ్ నగర్‌, శుభం గార్డెన్‌, పాతగుట్ట, గొల్లగుడిసెలు, దాతారుపల్లి, బస్వాపూర్‌ గ్రామాల్లో పర్యటన సాగనుంది.

కాగా.. టీఆర్ఎస్ పై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 15 సీట్లే గెలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయకత్వం నిర్ణయం ప్రకారం తాను పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాకు పూర్తి నమ్మకం ఉందని, కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..