AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లాయర్ ప్రాణాలు తీసిన భూ సమస్యలు.. కారులో వెంబడించి.. కత్తులతో దారుణంగా పొడిచి

భూ సమస్యలు, మట్టి మాఫియా ఓ లాయర్ ప్రాణాలు తీశారు. ఆయన కదలికలపై కాపు కాచిన దుండగులు దారుణంగా హత్య చేశారు. కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి.. కారు నుంచి కింద పడేసి, పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. హనుమకొండకు చెందిన....

Telangana: లాయర్ ప్రాణాలు తీసిన భూ సమస్యలు.. కారులో వెంబడించి.. కత్తులతో దారుణంగా పొడిచి
Lawyer Murder In Warangal
Ganesh Mudavath
|

Updated on: Aug 02, 2022 | 8:42 AM

Share

భూ సమస్యలు, మట్టి మాఫియా ఓ లాయర్ ప్రాణాలు తీశారు. ఆయన కదలికలపై కాపు కాచిన దుండగులు దారుణంగా హత్య చేశారు. కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి.. కారు నుంచి కింద పడేసి, పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. హనుమకొండకు చెందిన లాయర్ మూలగుండ్ల మల్లారెడ్డి.. సోమవారం ములుగు (Mulugu) జిల్లా కలెక్టరేట్ కు వచ్చారు. భూ సమస్యలపై అధికారులతో సంప్రదించి అదే రోజు సాయంత్రం 6.30కు హనుమకొండకు (Hanamkonda) తిరుగుపయనమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనను అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ములుగు మండలంలోని పందికుంట బస్‌ స్టేజీ సమీపంలో మల్లారెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. మల్లారెడ్డి కారు దిగి.. ఎందుకు ఢీ కొట్టారని వారిని ప్రశ్నించారు. వారు సంజాయిషీ ఇచ్చి, క్షమించాలని కోరడంతో మల్లారెడ్డి తన కారు ఎక్కాడు. అదే సమయంలో మరో నలుగురు వచ్చి.. మల్లారెడ్డిని వారిలో నుంచి కిందికి లాగారు. సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. మల్లారెడ్డి కారు డ్రైవర్ ను బెదిరించే కదలకుండా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు.

హత్య చేసిన తర్వాత నిందితులందరూ అదే కారులో ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి పాటిల్‌.. పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మర్డర్ ఇన్సిడెంట్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ములుగు ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ వెల్లడించారు.

కాగా.. లాయర్ మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ గ్రామానికి చెందిన ఆయన హనుమకొండలో స్థిరపడ్డారు. భూసమస్యల విషయమై మల్లారెడ్డి ములుగు కలెక్టర్‌, తహసీల్దారు ఆఫీస్ లకు వెళ్తున్నారు. ఆయనకు ములుగు మండలం మల్లంపల్లిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. అంతే కాకుండా ఎర్రమట్టి క్వారీ, పెట్రోలు బంకు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనను హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్