MLA Jeevan Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం.. నిందితుడి నుంచి కత్తి, పిస్టల్ స్వాధీనం
Telangana: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (MLA Jeevan Reddy) హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని... ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఆర్మూర్‌కు చెందిన మక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్‌గా గుర్తించారు.
Telangana: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (MLA Jeevan Reddy) హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని… ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఆర్మూర్‌కు చెందిన మక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్‌గా గుర్తించారు. తన భార్య లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో.. ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర ఉదయం ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర కత్తి, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అప్పటి నుంచే విభేదాలు..
కాగా ప్రసాద్ గౌడ్ కి జీవన్ రెడ్డి మధ్య సంవత్సర కాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. టీఆర్ఎస్ రెబల్ గా కల్లెడ సర్పంచ్ గెలిచిన ప్రసాద్ భార్య లావణ్య గెలుపొందారు. దీంతో టీఆర్ఎస్ అనుబంధ నేతగానే కొనసాగారు ప్రసాద్ గౌడ్. అయితే ఓడిపోయిన వాళ్లకు మద్దతు ఇవ్వడం , బిల్లులు ఆపించడం తో ఇద్దరి మధ్య వివాదాలు ముదిరాయి. ఇక జడ్పీ చైర్మన్ విట్టల్ రావు , ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య విభేదాల్లో జడ్పీకి అనుకూలంగా నిలబడ్డారు. అప్పటి నుంచి విభేదాలు ఇంకా తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే గతంలో ‘ఎమ్మెల్యే జీవన్‌రెడ్డీ ఖబడ్దార్’ అంటూ గతంలో వార్నింగ్ ఇచ్చారు ప్రసాద్‌గౌడ్. ఆ సందర్భంలో ఆయన ఏమన్నారో చూద్దాం. జీవన్‌రెడ్డిని ప్రసాద్‌గౌడ్ పక్కాగానే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వెపన్స్ డీలర్‌తో ఆయన జరిపిన సంభాషణ టీవీ9 చేతికి దొరికింది. దాన్నోసారి చూడండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..