Akkannapet And Medak: మెదక్ రైల్వే స్టేషన్‌కు మొదటి గూడ్స్ రైలు.. ఆ ఊర్లో తొలిసారిగా

మొట్టమొదటి గూడ్స్‌లో 948 టన్నుల ఎరువులను తీసుకు వచ్చారని అధికారులు తెలిపారు. సరుకుల రవాణాకు అనువుగా మెదక్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసిన హైదరాబాద్..

Akkannapet And Medak: మెదక్ రైల్వే స్టేషన్‌కు మొదటి గూడ్స్ రైలు.. ఆ ఊర్లో తొలిసారిగా
Medak Railway Station
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 02, 2022 | 7:51 AM

Akkannapet And Medak: 2022 ఆగస్టు 1వ తేదీన మొట్టమొదటి గూడ్స్ రైలు మెదక్ రైల్వే స్టేషన్ లోకి వచ్చింది. ఇటీవలే ప్రారంభించిన అక్కన్నపేట్- మెదక్ సెక్షనులో నడిపిన మొట్టమొదటి సరుకుల రైలు కూడా ఇదే. సరుకుల రవాణా జరిపేందుకు వీలుగా ఇటీవల జూలై నెలలో మెదక్ గూడ్స్ షెడ్డు నుంచి సరుకుల రవాణా జరపనున్నట్లు అధికారులు ప్రకటించారు. అందులో భాగంగా సోమవారం 15 మూసిన పైకప్పుతో ఉన్న వ్యాగన్లు (బిసిఎన్) కాకినాడ నుంచి మెదక్‌కు వచ్చాయి. దాంతో మెదక్ స్టేషన్‌లో సరుకుల రవాణా పనులు మొదలయ్యాయి. మొట్టమొదటి గూడ్స్‌లో 948 టన్నుల ఎరువులను తీసుకు వచ్చారని అధికారులు తెలిపారు.

కొత్త రైల్వే లైను ప్రాజెక్టు అక్కన్నపేట్ – మెదక్ సెక్షన్‌లో నిర్మించిన మెదక్ రైల్వేస్టేషన్ తెలంగాణ బోర్డర్‌లో చివరిస్టేషన్. అక్కన్నపేట్ -టు మెదక్‌ల మధ్య నిర్మించిన కొత్త రైల్వే లైను మధ్య దూరం 17 కిలోమీటర్లు కాగా దీనిని ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. ఆ తరువాత మెదక్ స్టేషన్ నుంచి సరుకుల రవాణా జరపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

మొదటి గూడ్స్ రైలులో కాకినాడ మెస్సర్స్ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ సైడింగ్ నుంచి పంపిన 948 టన్నుల ఎరువులు సోమవారం మెదక్ స్టేషన్‌కు వచ్చాయి. మొదటి గూడ్స్ ప్రయాణించిన దూరం దాదాపు 500 కిలోమీటర్లు అని అధికారులు తెలిపారు. సరుకుల రవాణాకు అనువుగా మెదక్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ డివిజన్‌ను, నిర్మాణ సంస్థను వారి బృందాలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇంచార్జి) అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!