AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వాటే స్మార్ట్ ఐడియా.. దాహాం తీర్చుకునేందుకు ఈ పక్షి కాకి కథను నిజం చేసింది.. చూడాల్సిన వీడియో ఇది

కథలోని కాకి తన దాహాన్ని తీర్చుకోవడానికి చిన్న చిన్న గులకరాళ్లను వేస్తూ.. నీటి మట్టాన్ని పైకి తీసుకురావడం ద్వారా ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఎంచుకుంది.

Viral News: వాటే స్మార్ట్ ఐడియా.. దాహాం తీర్చుకునేందుకు ఈ పక్షి కాకి కథను నిజం చేసింది.. చూడాల్సిన వీడియో ఇది
Thirsty Crow
Jyothi Gadda
|

Updated on: Aug 02, 2022 | 12:14 PM

Share

Viral Vide: దాహంతో ఉన్న కాకి కథను మనమందరం చిన్నప్పుడు చదువుకున్నాం.. కథలోని కాకి తన దాహాన్ని తీర్చుకోవడానికి చిన్న చిన్న గులకరాళ్లను వేస్తూ.. నీటి మట్టాన్ని పైకి తీసుకురావడం ద్వారా ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఎంచుకుంది. ఈసారి కూడా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, వీడియోలోని ప్రధాన పాత్ర కాకి కాదు. ఒక మాగ్పీ పక్షి.. ఇది కూడా చిన్న గులకరాయితో నీటి సీసాలో నీటి స్థాయిని పెంచడం కనిపించింది. ఆ వీడియో నెటిజన్లను అవాక్కయ్యేలా చేసింది. ఈ వీడియోను క్రీచర్స్ ఆఫ్ గాడ్ అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇది ఎంతగా వైరల్‌గా మారిందంటే ఇప్పుడు ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

కొత్తగా వైరల్ అయిన ఈ వీడియోలో, దాహంతో ఉన్న మాగ్పీ బాటిల్ నుండి నీరు త్రాగడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ బాటిల్‌లో నీరు చాలా తక్కువగా ఉండటంతో నీరు మాగ్పీ పక్షి నోటికి అందదు. అప్పుడే దాహంతో ఉన్న కాకి కథ తరహాలో ఒక్క వ్యూహం పన్నుతుంది. వెంటనే అటు ఇటూ చూసి.. చిన్న చిన్న రాళ్లను తెచ్చి ఆ బాటిల్‌లో వేస్తుంది. దాంతో బాటిల్‌లోని నీరు పైకి వస్తుంది. అలా ఆ పక్షి చివరకు తన దాహం తీర్చుకుంది.

ఇవి కూడా చదవండి

మాగ్పీ తెలివితేటలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒక వినియోగదారు కామెంట్‌ చేస్తూ..“ఈ పక్షి చాలా తెలివైనదిగా చెప్పుకొచ్చారు. ఆ పక్షి ఒక్కొక్కటిగా రాళ్లను వేస్తూ… నీటి మట్టాన్ని పెంచిన తీరు ఆశ్చర్యపరిచింది అంటున్నారు. “ఈ పక్షి నిజంగా మేధావి..అంటూ ఒకరు కామెంట్ చేయగా, దాహంతో ఉన్న కాకి కథ విన్నాము..ఇప్పుడు ప్రత్యక్షంగా మా కళ్లతో చూశామంటూ మరికొందరు వీడియోకి కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి