Video Viral: ఫైనల్ డెస్టినేషన్ అంటే ఇదే.. గుండెల్లో గుబులు రేపుతున్న దృశ్యాలు

రోడ్డుపై నడిచి వెళ్తున్నా, వాహనాల్లో వెళ్తున్నా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా కారులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎలా ప్రమాదం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ, రోడ్డు భద్రత నియమాలను ఫాలో అవుతూ...

Video Viral: ఫైనల్ డెస్టినేషన్ అంటే ఇదే.. గుండెల్లో గుబులు రేపుతున్న దృశ్యాలు
Accident Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 02, 2022 | 12:09 PM

రోడ్డుపై నడిచి వెళ్తున్నా, వాహనాల్లో వెళ్తున్నా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా కారులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎలా ప్రమాదం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ, రోడ్డు భద్రత నియమాలను ఫాలో అవుతూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. జంక్షన్ లాంటి కూడళ్లలో మరింత అప్రమత్తత అవసరం. అలాంటి చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా.. ప్రమాదానికి సంబంధించిన రకరకాల వీడియోలను మీరు సోషల్ మీడియాలో (Social Media) చూసే ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఆ వాహనంలో ఉన్న వారు బతికి ఉంటారన్న ఆలోచనే లేకుండా చేస్తుంది. అలాంటి షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. ఈ వీడియోలో ఓ కారు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. వేగంగా వస్తున్న ట్రక్కు దానిని ఢీ కొట్టి ముందుకు ఈడ్చుకెళ్తుంది. అదే సమయంలో ముందు నుంచి వస్తున్న ట్రక్కు ఆ వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారో, ఎంత మంది గాయపడ్డారో ఇంకా సమాచారం లభ్యం కాలేదు. ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో ప్రాణనష్టం జరిగే ఉండే అవకాశం ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఈ క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ 12 సెకన్ల వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 31 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోనే ఉంది. వీడియో చూసి తీవ్ర ఆవేదనకు లోనవుతున్న నెటిజన్లు.. ఫైనల్ డెస్టినేషన్ అని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.