Inspiring Story: 79 ఏళ్ల వయసులో బిజినెస్.. సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న మహిళ..
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత.. లాక్‌డౌన్ కారణంగా ఎందరో తమ ఉపాధిని కోల్పోయారు. నిరుద్యోగులుగా మిగిలారు. అదే సమయంలో మరికొందరు..
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత.. లాక్‌డౌన్ కారణంగా ఎందరో తమ ఉపాధిని కోల్పోయారు. నిరుద్యోగులుగా మిగిలారు. అదే సమయంలో మరికొందరు.. ప్రజల అవసరాలను గుర్తించి.. తమ తెలివి తేటలకు పదును పెట్టి.. వ్యాపారాన్ని ప్రారంభించారు.. నేటికీ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. వారిలో ఒకరే ముంబైకి చెందిన కోకిలా పరేఖ్. లాక్‌డౌన్ సమయంలో 79 ఏళ్ల కోకిలా ముంబైలో మసాలా టీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆమె తయారు చేసే రుచికరమైన టీని ప్రశంసిస్తూ స్నేహితులు, బంధువులు ప్రోత్సహించారు.ఈ ప్రత్యేకమైన మసాలా టీ తయారీ విధానం తన తల్లినుంచి నేర్చుకున్నారు కోకిల. దానినే వ్యాపారంగా మలచుకున్నారు. తల్లి ఆలోచనకు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. కోకిల కుమారుడు తుషార్.. మాసాల టీ తయారీకి కావాల్సిన సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేయడానికి సహాయం చేశాడు. ఈ టీకి KT చాయ్ మసాలా అని పేరు పెట్టారు. ఈ మసాలాలో కృత్రిమ రంగులు, కృతిమ రుచి ఉండవు. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ KT చాయ్ మసాలా టీ పొడిని భారతదేశం అంతటా సరఫరా చేస్తారు. ప్రస్తుతం, KT చాయ్ మసాలా రోజుకు 500 ఆర్డర్‌లను అందుకుంటుందని కోకిల చెప్పారు. 70 ఏళ్ల వయసులో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సాధారణ మహిళ ఇప్పుడు సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ కావడం అందరినీ ఆలోచింపచేస్తోంది. ప్రస్తుతం కోకిల కు 80 ఏళ్ళు.. ఆమె కృషి, పట్టుదలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..