రోజువారీ కూలీని వరించిన అదృష్టం.. గంటల వ్యవధిలోనే రూ.2,700కోట్లకు అధిపతి అయ్యాడు..!

ఇటుక బట్టీలో పని చేస్తున్న రోజువారీ కూలీ బిహారీ లాల్ (45)ని అదృష్టం వరించింది. వర్షాకాలం కారణంగా

రోజువారీ కూలీని వరించిన అదృష్టం.. గంటల వ్యవధిలోనే రూ.2,700కోట్లకు అధిపతి అయ్యాడు..!
Up Billionaire
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 03, 2022 | 11:14 AM

రోజువారీ కూలీ అకస్మాత్తుగా బిలియనీర్ అయ్యాడు. ఉన్నట్టుండి రూ. 2,700 కోట్లకు అతడు అధిపతిగా మారాడు. అకస్మత్తుగా వరించిన అదృష్టానికి అతడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.  జస్థాన్‌లోని ఇటుక బట్టీలో పని చేస్తున్న రోజువారీ కూలీ బిహారీ లాల్ (45)ని అదృష్టం వరించింది. వర్షాకాలం కారణంగా ఇటుక బట్టీ యూనిట్ మూసివేయబడింది. దాంతో అతడు ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో గల తన స్వస్థలానికి చేరుకున్నాడు. బీహారీ లాల్ తన గ్రామంలోని జన్ సేవా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా జన్ ధన్ ఖాతా నుండి రూ.100 విత్ డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతసేపటికే అతని ఖాతాలో రూ. 2,700 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు SMS వచ్చింది.

మెసేజ్‌ చూసిన బీహారీ లాల్ నమ్మలేకపోయాడు. అతని ఖాతాలో ఇంతపెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడిదని అతడు ఆశ్చర్యపోయాడు. వెంటనే బ్యాంక్‌ సిబ్బందిని సంప్రదించాడు. వారు అతని అకౌంట్‌ చేయగా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.2,700 కోట్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఒకటికి రెండు మూడు సార్లు అకౌంట్‌ చెక్‌ చేయించాడు. పాస్‌ బుక్‌ స్టేట్‌మెంట్‌ కూడా తీయించాడు. అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి అతని ఖాతా ఖాళీ అయ్యింది. కొన్ని గంటల తర్వాత తిరిగి అకౌంట్‌ చెక్‌ చేయగా అది కేవలం రూ. 126 మాత్రమే ఉందని చూపింది. దాంతో అతడు కంగుతిన్నాడు. తిరిగి బ్యాంక్‌ సిబ్బందిని సంప్రదించాడు.. ఈ మేరకు…బ్యాంకు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ అభిషేక్‌ సిన్హా ఇది స్పష్టం బ్యాంకింగ్‌ లోపం అన్నారు. ఏదో టెక్నికల్‌ ఇష్యూ కారణంగానే అలా కనిపించిందని చెప్పారు. అయితే, కొంతకాలం బిహారీ లాల్ ఖాతాను స్తంభింపజేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ సీనియర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

బిహారీ లాల్ రాజస్థాన్‌లోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తూ రోజుకు 600 నుండి 800 రూపాయలు సంపాదిస్తున్నాడు. కాని వర్షాకాలంలో ఇటుక బట్టీలు మూసివేసి ఉండటంతో అతను ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నాడు.