Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: మద్యం మత్తు ఎంతపనిచేసంది..? గోడ అనుకుని సాంబరు గిన్నెకు ఒరిగాడు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేసేందుకు వంటలు చేస్తుండగా

Crime News: మద్యం మత్తు ఎంతపనిచేసంది..? గోడ అనుకుని సాంబరు గిన్నెకు ఒరిగాడు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
Crime
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 03, 2022 | 1:12 PM

Crime News: మద్యం మత్తులో కొంతమంది ఏం చేస్తుంటారో వారికే తెలియదు..పీకల్లోతు మద్యం, మత్తుపదార్థల కారణంగా ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. తమ ప్రాణాలనే కాదు..ఇంటిల్లిపాదిని చిక్కుల్లోకి నెట్టేస్తుంటారు. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులని ఒంటరి చేసి అకాలంగా మృత్యువాతపడుతుంటారు.. తాజాగా తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబరులో పడ్డాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని మధురైలో పలంగానట్టిలోని గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేసేందుకు వంటలు చేస్తుండగా గ్రామానికి చెందిన ముత్తుకుమార్ అనే వ్యక్తి ఫుల్‌గా మద్యం తాగి తూలుతూ వంటలు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. అన్నదానానికి భారీ పాత్రలో సాంబారు చేస్తుండగా.. గోడ అనుకుని దానిపై కూర్చోబోయి అందులో పడిపోయాడు. వెంటనే గమనించిన గ్రామస్తులు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ముత్తుకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

ముత్తు కుమార్‌ను రక్షించే క్రమంలో పలువురు గ్రామస్తులకు సైతం సాంబారు మీదపడి గాయాలయ్యాయి. దీంతో పండుగ రోజు పలంగానట్టి గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్