Aamir Khan : “వారానికొకసారి నా ఇద్దరు మాజీ భార్యలను కలుస్తాను”.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఆమిర్‌ఖాన్‌

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆచితూచి సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకుంటున్నారు ఆమిర్‌ఖాన్‌.

Aamir Khan : వారానికొకసారి నా ఇద్దరు మాజీ భార్యలను కలుస్తాను.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఆమిర్‌ఖాన్‌
Aamir Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 04, 2022 | 5:57 PM

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్‌(Aamir Khan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆచితూచి సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకుంటున్నారు ఆమిర్‌ఖాన్‌. ఆయన సినిమాలనేనే వందల కోట్లను కొల్లకొడుతూ ఉంటాయి. ఇక సందేశాత్మక సినిమాలు చేయడంలో ఆమిర్‌ఖాన్‌ ముందుంటారు. త్వరలో ఈ స్టార్ హీరో లాల్ సింగ్ చడ్డా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. . ఆమిర్‌ఖాన్‌, రాధిక చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అందాల భామ కరీనా కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుండగా అక్కినేని యంగ్ హీరో  నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన కాఫీ విత్ కరణ్ షోలో ఆమిర్‌ఖాన్‌ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆమిర్‌ఖాన్‌ ఇటీవలే తన రెండో భార్య కిరణ్ నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. తన ఇద్దరి భార్యలతో విడిపోయినప్పటికీ ఆమిర్‌ఖాన్‌ వారితో మంచి రిలేషన్ ను మెయింటేన్ చేస్తున్నారు. అయితే తన రిలేషన్ లో ప్రేమ, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడమే తప్ప ఇంకెలాంటివీ లేవని అన్నారు ఆమిర్‌. తన మాజీ భార్యలు ఇద్దరి పై తనకు ఎంతో గౌరవం ఉంది అన్నారు. ఇప్పటికీ అందరం ఒక కుటుంబంలా కలిసి ఉంటామని, వారానికొకసారి అందరం కలుస్తుంటామని అన్నారు. తమ మధ్య  ప్రేమ, అభిమానం, గౌరవం అలానే ఉన్నాయని ఆమిర్‌ఖాన్‌ చెప్పుకొచ్చారు. ఇక ఆమిర్‌ఖాన్‌ మొదట రీనా ను వివాహం చేసుకున్నారు. ఆతర్వాత 2002లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత 2005లో ఆమిర్‌ కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరు గతఏడాది 2021లో విడిపోయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి