Telugu News Trending Heineken and The Shoe Surgeon Drop Sneakers That Will Have You Walking on Beer goes viral Telugu Trending News
Viral: బీర్ నింపిన సరికొత్త షూస్.. ఇలాంటి ఐడియాలు మీకెలా వస్తాయిరా నాయనా..
ఇంటర్నెట్‌లో చిత్ర విచిత్రమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లకు ఏ మాత్రం కొదవ ఉండదు. చిత్ర విచిత్రమైన దుస్తులు, నగలు, వాచ్‌ల, బ్రేస్‌లెట్లు.. ఇలా ఎన్నో వెరైటీలను మనం తరచూ ఆన్‌లైన్‌లో చూస్తూ ఉంటాం. గతేడాది ఒక ఫ్రెంచ్ డిజైనర్ ఆకు ఆకారంలో బ్యాగును డిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇంటర్నెట్‌లో చిత్ర విచిత్రమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లకు ఏ మాత్రం కొదవ ఉండదు. చిత్ర విచిత్రమైన దుస్తులు, నగలు, వాచ్‌ల, బ్రేస్‌లెట్లు.. ఇలా ఎన్నో వెరైటీలను మనం తరచూ ఆన్‌లైన్‌లో చూస్తూ ఉంటాం. గతేడాది ఒక ఫ్రెంచ్ డిజైనర్ ఆకు ఆకారంలో బ్యాగును డిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆతర్వాత ఈ ఏడాది జనవరిలో శాండ్‌విచ్ ఆకారంలో ఉన్న షూస్ తయారుచేసి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు వీటికి మించిన వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే ప్రముఖ బీర్ బ్రాండ్ కంపెనీ హీనెకెన్ (Heinekicks) షూ సర్జన్ అనే పేరుతో సరికొత్త స్నీకర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ షూస్‌లు బీరుతో నింపబడి ఉంటాయి. కాగా ఈ కస్టమైజ్డ్ స్నీకర్ కలెక్షన్‌ను ప్రారంభించేందుకు హీనెకెన్ సంస్థ ప్రముఖ షూ డిజైనర్ డొమినిక్ సియాంబ్రోన్‌తో జతకట్టింది. ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలోనే ఈ మోడళ్లను అందుబాటులోకితీసుకొచ్చింది.
Designed in collaboration with noted shoe designer, Dominic Ciambrone, to celebrate the smoothness of Heineken®️ Silver. Heinekicks aren’t your everyday shoe, but it’s not every day you get to walk on beer. pic.twitter.com/LefwD5X7if
ఈ స్నీకర్లలో బీర్‌ను పాప్ చేయడానికి ఇన్‌బిల్ట్ బాటిల్ ఓపెనర్ ఉంటుంది. అంతేగాక బీర్ అరికాళ్లలో ఇంజెక్ట్ అవ్వడానికి సరళమైన సర్జికల్ ఇంజెక్షన్ పద్ధతిని ఉపయోగించారు. ఈనేపథ్యంలో షూ సర్జన్ ధరించిన వారు బీరు తాగిన అనుభూతిని పొందవచ్చు. అయితే రోజూ ధరించడానికి ఈ షూస్ పనికిరావట. అప్పుడప్పుడు ధరించేవారికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయట. కాగా వీటిని సోమర్‌సెట్‌లోని లిమిటెడ్ ఎడిషన్ వాల్ట్‌లో ఆగస్టు 11 నుండి 24 వరకు ప్రదర్శనకు ఉంచనున్నారు. వీటిలో కొన్నింటిని ఈ ఏడాది చివరిలో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకున్నారు. కాగా ‘వాకింగ్ ఆన్ బీర్’ అంటూ హీనెకెన్ తయారుచేసిన ఈ బీర్ షూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘మాకు ఓ రెండు జతలు కావాలి’ అంటూ కొందరు ఎలా కొనాలో అడుగుతుండగా, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా నాయనా? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.