Video Viral: ఇదేం పిచ్చిరా నాయనా.. రోడ్డుపై బైక్ తో డేంజర్ స్టంట్స్.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే

నేటి కాలంలో సోషల్ మీడియా (Social Media) విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఫోన్లు, గాడ్జెట్స్ కు అతుక్కుపోతున్నారు. లైకులు, వ్యూస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. అందుకోసం...

Video Viral: ఇదేం పిచ్చిరా నాయనా.. రోడ్డుపై బైక్ తో డేంజర్ స్టంట్స్.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే
Bike Stunts Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 04, 2022 | 1:43 PM

నేటి కాలంలో సోషల్ మీడియా (Social Media) విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఫోన్లు, గాడ్జెట్స్ కు అతుక్కుపోతున్నారు. లైకులు, వ్యూస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. అందుకోసం విపరీతమైన చర్యలకూ పాల్పడుతున్నాు. చిన్న చిన్న ట్రిక్ లతో ఫేమస్ అవుతున్న వాళ్లు కొందరైతే.. ఎలాగైనా చేసి ఫేమస్ అవ్వాలని ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న వారు ఇంకొందరు. అందుకే ప్రమాదకరమైన స్టంట్స్ (Bike Stunts) చేసేందుకూ వెనుకాడటం లేదు. తమ అభిమాన సినీ హీరో చేసినట్లు చేయాలని భావించి ప్రమాదాలకు గురవుతున్నారు. అందుకోసం యువత రోడ్ల పైనే ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన వీడియోను ఢిల్లీ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బైక్ పై వెళ్తున్న ఓ యువకుడు తాను నడుపుతున్న వాహనంతో విన్యాసాలు చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తాడు. స్టంట్స్ చేసిన కాసేపటికి బైక్ బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోతుంది. బైక్ చాలా స్పీడ్ గా ఉండటంతో ఆ యువకుడు కిందపడి చాలా దూరం అలాగే ముందుకు వెళ్తాడు. అయితే.. అతను హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని, అధిక వేగంతో వాహనాలు నడపవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. విన్యాసాలు చేస్తూ రోడ్డుపై పడి ఈడ్చుకెళ్లిన తీరు చూస్తుంటే భయం కలుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. హెల్మెట్ ధరించినప్పటికీ ఇలాంటి విన్యాసాలు ఎవరూ చేయవద్దని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..