AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: “నా డెడ్ బాడీని వాళ్లు తాకవద్దు.. అదే నాకు మీరు చేసే మేలు”.. గర్భిణీ సూసైడ్

పచ్చని సంసారంలో అనుమానం చిచ్చు రేపింది. భార్య ఎవరితోనూ మాట్లాడడానికి వీలులేదని భర్త హుకుం జారీ చేశాడు. కాదని ధిక్కరిస్తే తీవ్రంగా కొట్టి హింసించేవాడు. రెండు సార్లు గర్భస్రావమైతే రాక్షసానందం పొందాడు. మరోసారి గర్భం...

Hyderabad: నా డెడ్ బాడీని వాళ్లు తాకవద్దు.. అదే నాకు మీరు చేసే మేలు.. గర్భిణీ సూసైడ్
Crime
Ganesh Mudavath
|

Updated on: Aug 04, 2022 | 8:31 AM

Share

పచ్చని సంసారంలో అనుమానం చిచ్చు రేపింది. భార్య ఎవరితోనూ మాట్లాడడానికి వీలులేదని భర్త హుకుం జారీ చేశాడు. కాదని ధిక్కరిస్తే తీవ్రంగా కొట్టి హింసించేవాడు. రెండు సార్లు గర్భస్రావమైతే రాక్షసానందం పొందాడు. మరోసారి గర్భం దాల్చితే పుట్టింట్లో వదిలేశాడు. అంతటితో ఆగకుండా అత్తింటికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాలన్నీ తల్లిదండ్రులకు చెప్పినా వారు లైట్ తీసుకున్నారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. తన డెడ్ బాడీని భార్య, అత్తింటి వారు తాకకూడదని సూసైడ్ లెటర్ లో పేర్కొంది. హైదరాబాద్ నగరంలోని చార్మినార్‌ ఫతే దర్వాజా ప్రాంతానికి చెందిన సుల్తాన్‌ పటేల్‌ అనే యువకుడికి ఫిర్డోస్ అన్సారి అనే యువతితో 2021లో వివాహమైంది. అప్పటినుంచి భార్యపై సుల్తాన్ అనుమానం పెంచుకునేవాడు. ఆమె ఎవరితో మాట్లాడినా ఊరుకునేవాడు కాదు. ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడు. బెల్టు, కర్రలతో చితకబాదేవాడు. ఆడబిడ్డ భర్త, అతని కుమారులతో మాట్లాడినా అనుమానించి, విచక్షణరహితంగా కొట్టేవాడు. ఈ విషయాలన్నీ ఎవరికైనా చెబితే రివాల్వార్‌తో కాల్చి చంపేస్తానని బెదిరించేవాడు. అంతే కాకుండా ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి, వాటిని అందరికీ చూపిస్తానని వేధించేవాడు. ఆరోగ్య కారణాలతో అన్సారీకి రెండు సార్లు గర్భస్రావమైంది. అయితే ఈ ఘటనలపై సుల్తాన్ ఏ మాత్రం బాధపడకపోగా ఆనందపడ్డాడు. తనను భర్త ఎంతగా వేధించేవాడనే విషయాన్ని అన్సారీ డైరీలో రాసుకుంది.

కాగా ఆమె మరోసారి గర్భం దాల్చడంతో ప్రసవం కోసం పుట్టింటికి పంపించాడు. ఈ నెల 1న షాహిన్‌నగర్‌లో ఉంటున్న అత్త గారింటికి వెళ్లి.. భార్య అన్సారీని తీవ్రంగా దూషించి, కొట్టాడు. ఇక వేధింపులు తట్టుకోలేక అత్తగారింట్లో తాను పడుతున్న నరకాన్ని తల్లిదండ్రులకు చెప్పి కన్నీరుమున్నీరయ్యింది. తనను కాపాడాలంటూ వేడుకుంది. తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పాలని ప్రయత్నించారు. భార్యాభర్తలన్నాక గొడవలుంటాయని సర్ది చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్సారీ తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేధింపులు తాళలేక చనిపోతున్నానని సూసైడ్ నోట్ లో రాసింది. భర్త, అత్తమామలు తన మృతదేహాన్ని తాకకుండా అడ్డుకోవాలని కోరింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. పరారీలో ఉన్న భర్త సుల్తాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి