Andhra Pradesh: జగనన్న తోడు నిధులు విడుదల నేడే.. అర్హులైన వారికి వడ్డీ లేని రుణాలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో జగనన్న తోడు నిధులను విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10వేలు వడ్డీ లేని రుణాలను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ (CM Jagan) లబ్ధిదారుల బ్యాంకు...

Andhra Pradesh: జగనన్న తోడు నిధులు విడుదల నేడే.. అర్హులైన వారికి వడ్డీ లేని రుణాలు
Cm Jagan
Follow us

|

Updated on: Aug 03, 2022 | 7:16 AM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో జగనన్న తోడు నిధులను విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10వేలు వడ్డీ లేని రుణాలను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ (CM Jagan) లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఈ రుణాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలో 3.95 లక్షల మందికి రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వివరించింది. అంతే కాకుండా గత ఆరు నెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీ రీఇంబర్స్‌మెంట్‌నూ విడుదల చేయనున్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.48.48 కోట్లు వడ్డీని చెల్లించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే తమ లక్ష్యమన్న సీఎం జగన్.. పాదయాత్రలో వారి కష్టాలు చూశానని, వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 14 లక్షల మందికి మంచి చేశామని, ప్రభుత్వ పథకాలను చేరవేయగలిగామని వివరించారు.

జగనన్న తోడు పథం ద్వారా అందజేసే రుణాలకు పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అర్హత కలిగిన ఒక్కొక్కరికి రూ.10వేలు రుణం అందిస్తున్నాం. వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ రూ.16.16 కోట్లు కలిపి, మొత్తం రూ.526.62 కోట్లు ప్రయోజనం కలుగుతుంది. అర్హులైనప్పటికీ రుణం రాకపోతే స్థానికంగా ఉండే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అవినీతికి తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా అర్హులైన వారికి మాత్రమే పథకం ప్రయోజనాలు అందిస్తాం.

     – వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ