Andhra Pradesh: పేదవారికి అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని సేవలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక, అత్యుత్తమ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ ఏర్పాటైన సంగతి విదితమే....మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Andhra Pradesh: పేదవారికి అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని సేవలు
Ysr Aarogyasri Health Care
Follow us

|

Updated on: Aug 03, 2022 | 6:52 AM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక, అత్యుత్తమ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ ఏర్పాటైన సంగతి విదితమే. ఈ పథకంలో చికిత్సల సంఖ్యను మరింత పెంచడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. 2019 తర్వాత.. రూ.ఐదు లక్షల లోపు యాన్యువల్ ఇన్ కమ్ ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ (Arogya Sri) పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. తద్వారా 1.40 కోట్ల కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందుతోంది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 1,700లకు పైగా ఆస్పత్రుల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని 137 ప్రైవేట్‌ కార్పొరేట్‌ హాస్పిటల్స్, 17 సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందుతోంది. కరోనా చికిత్సను పథకం పరిధిలోకి తీసుకురావడంతో పాటు.. బ్లాక్‌ఫంగస్, మిస్‌–సీ వంటి జబ్బులనూ ఇందులో చేర్చారు. దీంతో ప్రజలపై పడిన పెనుభారం తప్పింది. ఇప్పటికే 2,446 చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకంలో ఉండగా.. తాజాగా మరో 700 రకాల చికిత్సలను పథకంలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాగా.. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను గతంలో ఆదేశించారు. ప్రస్తుతం 2,446 రకాల సమస్యలకు సేవలు అందిస్తుండగా.. ఆ సంఖ్యను మరింత పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ అంశంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణులకు సహజ ప్రసవంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులదేనన్న ముఖ్యమంత్రి.. ఆరోగ్య ఆసరా కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు.. అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైన వారి పోషణ ఆర్థిక పరంగా సహాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ‘ఆరోగ్య ఆసరా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్య చికిత్స చేయించుకున్న వారికి.. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తే రోజుకు రూ.225, లేదా నెలకు రూ.5వేలు చొప్పున భృతి అందిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే దాదాపు 10 లక్షల మందికి ఆర్థిక సహాయం అందింది. కాగా.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నామని, అక్కడి నుంచి అనుమతులు రాగానే క్షేత్ర స్థాయిలో అమలు పరుస్తామని సంబంధిత వర్గాల అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..