AP News: ఏపీలో రెచ్చిపోతున్న ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు.. లోన్ కట్టలేదని కుటుంబ సభ్యులపై దాడి..
అన్న తీసుకున్న లోన్ కట్టలేదని.. ఇంటివచ్చి మరి ఇంట్లో ఉన్న తమ్ముడిపై కర్రతో దాడిచేశారు. బూటు కాలితో తన్నారని బాధితుడు గోవింద్ చెప్పాడు.
Loan Recovery Agents Harassment : ఏపీలో ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. లోన్ కట్టడానికి ఇరవై రోజుల టైం గడువు అడిగినందుకు.. లోన్ తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులపై ఎజెంట్లు దాడి చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు రెచ్చిపోయారు. అన్న తీసుకున్న లోన్ కట్టలేదని.. ఇంటివచ్చి మరి ఇంట్లో ఉన్న తమ్ముడిపై కర్రతో దాడిచేశారు. బూటు కాలితో తన్నారని బాధితుడు గోవింద్ చెప్పాడు. వికలాంగుడననే జాలి లేకుండా వాతలొచ్చేలా కర్రతో కొట్టారని బాధితుడు గోవింద్ ఆవేదన వ్యక్తంచేశాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన కోటేశ్వరరావు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీలో మూడు లక్షల యాబై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇప్పటికే రెండు లక్షల యాబై వేల రూపాయలు తిరిగి చెల్లించాడు. మిగతా లోన్ ఇరవై రోజుల్లో క్లీయర్ చేస్తానని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులతో చెప్పాడు.
అయితే.. ఇంకా టైం ఇవ్వడం కుదరదు. వెంటనే కట్టకపోతే ఇంటికి స్టాంప్ వేసి పోతామని బెదిరించారని కోటేశ్వరావు చెప్పాడు. తాను ఇంట్లో లేని సమయంలో ఫైనాన్స్ ఏజెంట్లు వచ్చి వికలాంగుడైన మా తమ్ముడిపై దాడి చేశారని వాపోయాడు. దాడిచేసిన ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లపై బాధితులు నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..