Weight Loss Tips: ప్రతిరోజూ ఈ గింజలు తింటే ఎంత బరువున్నా హాంఫట్.. వారంలోనే మార్పు..

రోజూ కొన్ని ఆహార పదర్థాలను, డైట్లను అనుసరిస్తే ఊబకాయం నుంచి బయటపడవచ్చు. ఇంకా తృణ ధాన్యాలు, గింజలతో కూడా వారంలోనే క్రమంగా బరువు తగ్గొచ్చని పేర్కొంటున్నారు.

Weight Loss Tips: ప్రతిరోజూ ఈ గింజలు తింటే ఎంత బరువున్నా హాంఫట్.. వారంలోనే మార్పు..
Weight Loss Tips
Follow us

|

Updated on: Aug 02, 2022 | 6:10 AM

Seeds For Weight Loss: ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు.. పెరుగుతున్న బరువు గురించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈరోజుల్లో జనజీవనం చాలా బిజీగా మారింది. దీంతో వ్యాయామానికి, సరదాగా గడిపేందుకు కూడా సమయం దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊబకాయం బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే సరైన ఆహారాన్ని అనుసరిస్తే సులభంగా బరువు తగ్గవచ్చంటున్నారు. రోజూ కొన్ని ఆహార పదర్థాలను, డైట్లను అనుసరిస్తే ఊబకాయం నుంచి బయటపడవచ్చు. ఇంకా తృణ ధాన్యాలు, గింజలతో కూడా వారంలోనే క్రమంగా బరువు తగ్గొచ్చని పేర్కొంటున్నారు. బరువు తగ్గడానికి ఆహారంలో ఎలాంటి విత్తనాలను చేర్చుకుంటే మంచిది.. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఈ విత్తనాలను తినాలి..

అవిసె గింజలు: అవిసె గింజలు ఒమేగా-3 మంచి మూలంగా పరిగణిస్తారు. ఒమేగా 3 కొవ్వులు శరీరంలోని కొవ్వును కరిగించడానికి పని చేస్తాయి. అంతే కాకుండా అవిసె గింజల్లో ఐరన్, ప్రొటీన్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ అవిసె గింజలను తినవచ్చు. ఇంకా పలు సలాడ్లలో, పానీయాలలో, కూరగాయలలో కలిపి తినవచ్చు.

ఇవి కూడా చదవండి

పొద్దుతిరుగుడు గింజలు: పొద్దుతిరుగుడు విత్తనాలు బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని సలాడ్ లేదా సూప్‌లో కలిపి కూడా తినవచ్చు. ఇది విటమిన్ ఇ మంచి మూలం కూడా. పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో అధిక కేలరీలు కరిగిపోతాయి. అందువల్ల బరువు పెరుగుతున్న వారు వీటిని తీసుకోవడం మంచిది.

చియా విత్తనాలు: చియా విత్తనాలు బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఆకలిని తగ్గించడంలో సహాయపడుతాయి. కావున వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో బరువు కూడా అదుపులో ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి