Swimming Benefits: స్విమ్మింగ్‌తో అస్తమాకు చెక్‌ పెట్టొచ్చు.. రోజూ ఈత కొడితే ఎన్ని లాభాలో.. తప్పనిసరిగా తెలుసుకోండి

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, బరువును తగ్గించుకోవాడానికి, వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి కొన్ని రకాల వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. ఆస్తమాతో బాధపడుతున్న వారు ఈత కొడితే చాలామంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Swimming Benefits: స్విమ్మింగ్‌తో అస్తమాకు చెక్‌ పెట్టొచ్చు.. రోజూ ఈత కొడితే ఎన్ని లాభాలో.. తప్పనిసరిగా తెలుసుకోండి
Swimming
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 01, 2022 | 6:00 AM

Benefits Of Swimming For Asthma: ఉబ్బసము తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. అస్తమా దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఇది పిల్లలతోపాటు పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు శ్వాస తీసుకోవడం కష్టతరం అవుతుంది. ఈ పరిస్థితిలో వ్యాయామం చేయడం కష్టంగా మారుతుంది. అయినప్పటికీ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, బరువును తగ్గించుకోవాడానికి, వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి కొన్ని రకాల వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. ఆస్తమాతో బాధపడుతున్న వారు ఈత కొడితే చాలామంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది అస్తమా బాధితులకు ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. శ్వాశ తీసుకునే పరిస్థితిపై నియంత్రణను పొందడంలో ఈత సహాయపడుతుంది. అలాగే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆస్తమా లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. ఆస్తమాతో బాధపడేవారికి వారి లక్షణాలను తగ్గించడం కోసం స్విమ్మింగ్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఈత ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈత కొట్టినప్పుడు ఊపిరితిత్తులు పని మెరుగుపడుతుంది. అలాంటి వారు సరిగా.. ఊపిరి పీల్చుకుంటారు. ఇది గణనీయంగా పెరుగుతుంది. దీంతో ఊపిరితిత్తులపై తక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే.. రోజువారీ పనుల కోసం ఊపిరితిత్తులపై అదనపు ఒత్తిడిని పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
  2. స్విమ్మింగ్ వాపులను తగ్గించగలదు. మీరు క్రమం తప్పకుండా ఈత కొట్టినప్పుడు శ్వాసనాళాలలో మంటలు గణనీయంగా తగ్గుతాయి. మంట తగ్గితే సరిగ్గా ఊపిరి పీల్చుకోవచ్చు. ఊపిరితిత్తులపై ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది.
  3. స్మిమ్మింగ్ చేయడం వల్ల కండరాలు కూడా బలపడుతాయి. ఈత కండరాల బలాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. కండరాలు ధృఢంగా ఉంటే రోజువారీ కార్యకలాపాలను సజావుగా చేయవచ్చు.
  4. ఈత సహనాన్ని పెంచుతుంది. చాలా కాలం పాటు ఈత కొట్టడం ప్రాక్టీస్ చేసినప్పుడు, మీ ఊపిరితిత్తులు దానికి అలవాటు పడతాయి. ఇలాంటి వ్యాయామాలు సహనాన్ని పెంచి రిలాక్స్ గా ఉంచుతాయి. దీంతోపాటు శ్వాస సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి.
  5. ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..