Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Chilli Powder: మిర్చి పౌడర్‌ కొనుగోలు చేస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

తాతలు, ముత్తాతల కాలంలో ఎర్ర మిరపకాయలను కొనుగులు చేసి రోలులో మెత్తగా రుబ్బి.. పొడిగా తయారు చేసేవారు. అయితే సమయాభావం వల్ల మార్కెట్‌ నుంచే కారం కొనుగోలు చేసి తెచ్చుకోవడం మొదలుపెట్టారు.

Red Chilli Powder: మిర్చి పౌడర్‌ కొనుగోలు చేస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Red Chilli Powder
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 31, 2022 | 6:38 AM

Real Vs Fake Red Chilli Powder: రెడ్ చిల్లీ పౌడర్ (మిర్చి) అనేది మన వంటగదిలో ఒక ముఖ్యమైన మసాలా దినుసు. అది లేకుండా రుచికరమైన వంటకాలను అస్సలు ఊహించలేం. కూరగాయలు, నాన్-వెజ్, పప్పులు ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలలో మిర్చిని ఉపయోగిస్తారు. తాతలు, ముత్తాతల కాలంలో ఎర్ర మిరపకాయలను కొనుగులు చేసి రోలులో మెత్తగా రుబ్బి.. పొడిగా తయారు చేసేవారు. అయితే సమయాభావం వల్ల మార్కెట్‌ నుంచే కారం కొనుగోలు చేసి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. మార్కెట్‌లో దొరికే ఈ మసాలా పదార్థాలలో కల్తీ జరుగుతుందనే భయం ఎప్పుడూ వెంటాడుతుంది. కావున మిర్చి పౌడర్‌ను ఎప్పుడు కొనడానికి వెళ్లినా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. కల్తీ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

రెడ్ చిల్లీ పౌడర్‌ను వీటితో ఎక్కువగా కలుపుతారు..

  • రెడ్ చిల్లీ పౌడర్ ద్వారా ఎక్కువ లాభం పొందడానికి చాలా మంది వ్యాపారులు పలు పదార్థాలను, రసాయనాలను కలుపుతారు.
  • కృత్రిమ రంగు – ఇటుక, రంపపు పొడి
  • చెడిపోయిన మిరపకాయలు – సుద్ద పొడి – ఊక – సబ్బు – ఎర్ర మట్టి
  • మసాలాను కల్తీ చేసి మార్కెట్‌లో ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది.
  • దీంతో ప్రజలు మార్కెట్‌లో చూసి వెంటనే కొనుగోలు చేస్తారు.

కల్తీ పదార్థాలపై FSSAI కూడా అవగాహన కల్పించింది. భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) కల్తీ ఎర్ర మిర్చి పౌడర్‌ను గుర్తించడానికి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుంది. నకిలీ మసాలాల కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే నకిలీ ఎర్ర మిరప పొడిని గుర్తించడానికి సులభమైన మార్గాలు ఏమిటో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఈ విధంగా నకిలీని గుర్తించండి

  • దీని కోసం మీరు ఒక గ్లాసు నీటిని తీసుకోండి.
  • తర్వాత దానికి 1 టీస్పూన్ ఎర్ర మిరప పొడిని కలపండి.
  • నీటి ద్వారా మిర్చిలో అవశేషాలను పరీక్షించండి.
  • చేతులకు రాసుకుని చర్మం గరుకుగా అనిపిస్తే అందులో ఇటుక పొడి కలిపినట్లు అర్థం చేసుకోండి.
  • ఈ పౌడర్ మీ చేతుల్లో సబ్బు లాగా స్మూత్‌గా అనిపిస్తే అందులో సబ్బు భాగాలు మిక్స్ అయ్యాయని అర్థం చేసుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..