Good Sleep Tips: రాత్రి వేళల్లో నిద్ర పట్టడం లేదా..? వాటికి దూరంగా ఉంటేనే మంచిదట.. లేకపోతే కష్టాలే..
కొన్నిసార్లు నిద్రపోవడం కష్టంగా ఉండవచ్చు. కానీ.. మంచి రాత్రి నిద్ర పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది హార్మోన్లు, ఎంజైమ్‌ల మెరుగైన పనితీరులో సహాయపడుతుంది.
Good Sleeping Tips: ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర పోవడం చాలాముఖ్యం. ఈ జీవనశైలి ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సరిగ్గా నిద్రపోనప్పుడు అది ఆరోగ్యంతో పాటు మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. మీ మెదడు బాగా విశ్రాంతి తీసుకోకపోతే, మెదడు సరిగా పనిచేయదు. ఒత్తిడి, చికాకుతో పనిలో పేలవమైన పనితీరు, అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు నిద్రపోవడం కష్టంగా ఉండవచ్చు. కానీ.. మంచి రాత్రి నిద్ర పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది హార్మోన్లు, ఎంజైమ్‌ల మెరుగైన పనితీరులో సహాయపడుతుంది. అలాగే, బాగా విశ్రాంతి పొందిన మనస్సు, శరీరం పనిలో అలాగే ఇంట్లో కూడా మంచి ఫలితాలకు ఊతమిస్తుంది. అయితే.. నిద్రకు ఆటంకం కలిగించే అనేక కారణాలు ఉంటాయి. మన జీవనశైలి కూడా నిద్రలేమికి దారితీస్తుంది. కొన్ని అలవాట్లు రాత్రి నిద్రను పాడుచేస్తాయి. కావున మంచిగా నిద్ర పోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచిది..
నీలి కాంతికి దూరంగా ఉండండి: సాయంత్రం, రాత్రి వేళల్లో బ్లూ లైటింగ్‌ను నివారించండి. నీలి కాంతికి గురైనప్పుడు శరీరం పగటిపూట అని భావిస్తుంది. తక్కువ మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. శరీరం తక్కువ మెలటోనిన్ ఉత్పత్తి చేసినప్పుడు రాత్రి నిద్రపోవడం కష్టంగా మారుతుంది. కావున సాయంత్రం వేళల్లో (కాంతి) స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడం ఉత్తమం. అందుకే ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లకు దూరంగా ఉండండి.
కెఫిన్, పొగ తాగవద్దు: కెఫిన్ పానీయాలు రాత్రివేళ తాగడం మంచిది కాదు. కెఫిన్ కలిగిన పానీయాలు తాగినప్పుడు, అది శరీరానికి శక్తిని ఇస్తుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఇది మీకు రోజంతా పని చేయడంలో సహాయపడుతుంది. అయితే, రోజు ఆలస్యంగా కెఫిన్ పానీయాలు తాగడం వల్ల మీ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అది నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. అందుకే రాత్రి వేళల్లో టీ, కాఫీ, పొగకు దూరంగా ఉండటం మంచిది.
పడుకునే ముందు వ్యాయామం చేయకండి: పడుకునే ముందు వ్యాయామాన్ని నివారించండి. నిద్రవేళకు 3-4 గంటల ముందు వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర పొందవచ్చు. అయితే పడుకునే ముందు వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుకుదనం పెరుగుతుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగించే కొన్ని హార్మోన్లను పెంచుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి