Ginger Benefits: అల్లంతో ఇలా చేస్తే శరీరంలోని ఆ సమస్యలన్నీ మటుమాయం.. మరెన్నో ప్రయోజనాలు..

అల్లం ఆహార రుచిని మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇది పలు ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది.

Ginger Benefits: అల్లంతో ఇలా చేస్తే శరీరంలోని ఆ సమస్యలన్నీ మటుమాయం.. మరెన్నో ప్రయోజనాలు..
Ginger
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 01, 2022 | 6:19 AM

Amazing Health Benefits Of Ginger: మన వంటింట్లో ఎన్నో ఔషధాలు దాగున్నాయి. ఇవి అనారోగ్య సమస్యలను దూరం చేసేందు సహాయపడతాయి. అలాంటి వాటిలో అల్లం ఒకటి.. అల్లం ఆహార రుచిని మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇది పలు ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్, వాపులను తగ్గిస్తుంది. గొంతు దురదను నయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ అద్భుతమైన మసాలాను ఆహారంలో చేర్చుకోవడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఆహారంలో అల్లం చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

యాంటీఆక్సిడెంట్లు పుష్కలం: ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అత్యధిక స్థాయిలో ఉంటాయి. అందువల్ల క్యాన్సర్, స్ట్రోక్ వంటి వివిధ ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్‌తో కణాల నష్టాన్ని నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను స్థిరీకరిస్తాయి..ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. తద్వారా శరీరాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. మంటను తగ్గిస్తుంది: అల్లంలోని పోషకాలు శరీరంలో వాపు, అంటువ్యాధులు, సీజనల్‌ వంటి వాటినుంచి కాపాడతాయి. అయితే.. ఆరోగ్యకరమైన కణాలు, కణజాలాలు, వివిధ అవయవాలకు హాని కలిగించే ఆక్సీకరణ ఒత్తిడి వల్ల వాపు సాధారణంగా కనిపిస్తుంది. గుండె సమస్యలు, కీళ్లనొప్పులు మొదలైన అనేక అంతర్లీన వ్యాధులకు కూడా వాపు కారణం. ఇలాంటి సమస్యలను నివారించి మంటను తగ్గిస్తుంది.

వాంతులు, వికారాన్ని తగ్గిస్తుంది: అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వికారం చికిత్సలో సహాయపడి.. వాంతులను నివారిస్తుంది. ఇది అజీర్ణం, అసౌకర్యాన్ని కలిగించే కడుపు ఆమ్లాలను స్థిరపరచడంలో కూడా సహాయపడుతుంది. మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు అల్లం సమర్థవంతంగా చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: మధుమేహంతో బాధపడేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అల్లం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పీరియడ్స్‌ నొప్పుల నుంచి ఉపశమనం: అల్లం నొప్పలను కూడా తగ్గిస్తుంది. అల్లం వినియోగం ద్వారా పీరియడ్స్‌ నొప్పులు, తిమ్మిర్లను తగ్గించుకోవచ్చు.

రోజువారీ ఆహారంలో అల్లం ఎలా జోడించాలి

  • డిటాక్స్ వాటర్ చేయడానికి కొన్ని నిమ్మకాయలతో పాటు కొన్ని కట్ అల్లం ముక్కలను జోడించి పానీయాన్ని తయారు చేసుకోవచ్చు
  • ప్రతిరోజూ ఉదయం వేడిగా ఒక కప్పు అల్లం టీ తాగండి
  • కొద్దిగా అల్లం రసంలో తేనె మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం తాగాలి
  • కూరలు, ఉడికించిన కూరగాయలలో తురిమిన అల్లం కలపండి
  • అల్లంతో చట్నీ, బిస్కెట్లు, కేకులు లాంటివి కూడా చేసుకోని తినవచ్చు

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.