AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric Milk: పసుపు పాలు తాగుతున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు పాలను తీసుకోవడం చాలా మంచిది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ ఇది కూడా హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Turmeric Milk: పసుపు పాలు తాగుతున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి
Turmeric Milk
Shaik Madar Saheb
|

Updated on: Jul 31, 2022 | 6:45 AM

Share

Side Effects Of Turmeric Milk: వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండేందుకు చాలామంది పసుపు పాలను తాగుతుంటారు. పసుపు, పాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. అందుకే వాటిని కలిపి తీసుకోవడం వల్ల పోషకాలు రెట్టింపు అవుతాయని భావిస్తారు. సాధారణంగా వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. పసుపును మసాలాగా దినుసుగా కాకుండా.. గాయం, మంట సమస్యలకు పసుపును యాంటిబయోటిక్ గా ఉపయోగిస్తారు. ఇంకా పాలలో కూడా కాల్షియం, పోషకాలు మెండుగా ఉన్నాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు పాలను తీసుకోవడం చాలా మంచిది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ ఇది కూడా హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి వారు పసుపు పాలు తాగకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

పసుపు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలు

గర్భిణులకు ప్రమాదం: గర్భిణులు పసుపు పాలకు దూరంగా ఉండటం మంచిది. పసుపు ప్రభావం వేడిగా ఉంటుంది. కావున ఇది కడుపులో వేడిని సృష్టిస్తుంది. గర్భిణీ స్త్రీలు దీనిని నివారించాలి. ఎందుకంటే ఇది గర్భస్రావానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

కాలేయంలో బలహీనత: పసుపు పాలు తాగడం కాలేయానికి చాలా హాని కలిగిస్తుంది. ఎందుకంటే ముఖ్యమైన అవయవానికి వేడి పదార్థాలు మంచివి కావు. కాలేయం బలహీనంగా ఉన్నప్పుడు శరీరం కూడా అనేక విధాలుగా నిస్సహాయంగా మారుతుంది.

కడుపు సమస్యలు: ఒక రోజులో ఒకటి కంటే ఎక్కువ టీస్పూన్ పసుపు తీసుకుంటే.. అది కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. రాళ్ల సమస్య ఉన్నవారు పసుపు పాలు తాగకూడదు. ఈ మసాలాలో ఉండే ఆక్సలేట్ కాల్షియం కరగడానికి అనుమతించదు. ఇది క్రమంగా మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో పసుపు వినియోగాన్ని తగ్గించాలి.

డయాబెటిస్‌లో సమస్యలు: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీంతో అన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిక్ రోగులకు పసుపు కూడా హానికరంగా పరిగణిస్తారు. ఎందుకంటే దీనిని తీసుకోవడం వల్ల ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ