AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weakness: బలహీనతతో బాధపడుతున్నారా..? ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఫుల్ ఎనర్జీ అంతే..

శరీరానికి శక్తి లభించే వాటిని ఎప్పుడూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు శరీరంలోని బలహీనతకు కారణం ఏంటీ..?

Weakness: బలహీనతతో బాధపడుతున్నారా..? ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఫుల్ ఎనర్జీ అంతే..
Weakness
Shaik Madar Saheb
|

Updated on: Aug 02, 2022 | 6:30 AM

Share

Foods To Reduce Weakness: దైనందిన జీవితంలో మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బలహీనతకు గురవుతుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేం.. ఏకాగ్రత పూర్తిగా దెబ్బ తింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేలికగా జీర్ణమయ్యేవి, శరీరానికి శక్తి లభించే వాటిని ఎప్పుడూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు శరీరంలోని బలహీనతకు కారణం ఏంటీ..? దాన్ని దూరం చేయడానికి ఆహారంలో ఎలాంటి పదార్థాలను చేర్చుకోవాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..

శరీరంలో బలహీనతకు కారణం..

  • విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది.
  • డిప్రెషన్, ఆందోళన కూడా శరీరాన్ని బలహీనం చేస్తాయి.
  • ఇది ఏదో ఒక రకమైన వ్యాధి వల్ల కూడా ఇలా జరుగుతుంది.

శరీరంలో బలహీనత ఉంటే ఆహారంలో వీటిని జోడించండి..

ఇవి కూడా చదవండి

సీజనల్ పండ్లు, కూరగాయలతో శరీరానికి ప్రయోజనం..

బలహీనంగా భావించే వ్యక్తులు వారి ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. ఎందుకంటే శరీరానికి ఎంతో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండ్లలో ఉంటాయి. అదే సమయంలో పండ్లలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్య ఉండదు. శరీరంలో నీటి కొరత కూడా బలహీనతకు కారణమవుతుంది.

లీన్ ప్రొటీన్ తీసుకోండి..

శరీర బలహీనతను తొలగించడానికి లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. దీని కోసం ఆహారంలో సముద్రపు (చేపలను) ఆహారాలను, మాంసం, గుడ్లు వంటి వాటిని చేర్చుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు, పెరుగు, కాయధన్యాలను తీసుకోవచ్చు. లీన్ ప్రోటీన్ గుండెకు చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గింజలు తినండి..

శరీరంలో బలహీనత ఉన్నప్పుడు నట్స్, తృణ ధాన్యాలు తినవచ్చు. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా అవి సులభంగా జీర్ణమవుతాయి. మరోవైపు ప్రతిరోజూ గింజలను తీసుకుంటే మీ బలహీనత, అలసట తొలగిపోతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి