Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలో లీకైన విషవాయువు.. 50 మంది మహిళా ఉద్యోగులకు అస్వస్థత
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్చుతాపురం సెజ్ లో ఒక పరిశ్రమలో విషవాయువు రిలీజ్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్చుతాపురం సెజ్ లో ఒక పరిశ్రమలో విషవాయువు రిలీజ్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా విషవాయువు విడుదల కావడంతో అక్కడ పని చేస్తోన్న 50 మంచి మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారంతో మహిళలు ఇబ్బంది పడ్డారు. కొంత మంది స్పృహకోల్పోయారు. మంగళవారం జిల్లాలోని అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ పరిశ్రమలో విష వాయువు లీకైంది.
విష వాయువును పీల్చిన బ్రాండిక్స్‌కు చెందిన మహిళా ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 50 మంది దాకా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురరైనట్లు తెలుస్తోంది. విష వాయువును పీల్చడంతో వాంతులు, వికారం గురైనట్టు తెలుస్తోంది. వీరిలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్థతకు గురైన మహిళలను హుటాహుటీన ఆసుపత్రులకు తరలించింది.