Viral: రాలిన ఆకు అనుకుంటే పొరపాటే.. టచ్ చేసి చూస్తే మైండ్ బ్లాంకే!

సముద్రం అటుపోట్లు వచ్చే ప్రాంతంలో అరుదైన జాతులు/జీవులపై పరిశోధనలు చేస్తున్నారు విశాఖకు చెందిన ఈస్ట్‌కోస్ట్‌ కన్జర్వేషన్‌ టీమ్‌ సభ్యులు.

Viral: రాలిన ఆకు అనుకుంటే పొరపాటే.. టచ్ చేసి చూస్తే మైండ్ బ్లాంకే!
Viral News.
Follow us

|

Updated on: Aug 02, 2022 | 1:34 PM

సాధారణంగా పచ్చని ఆకుల మాదిరిగా కొన్నిరకాల కీటకాలను చూస్తూనే ఉంటాం. వర్షాకాలంలో అనేక రకాల వింత కీటకాలు.. పురుగులు చెట్లపై కనిపిస్తుంటాయి. అలాగే అడవులలో.. సముద్రాలలో కొన్నిసార్లు చిత్రమైన జీవులు చూస్తుంటాం. ముఖ్యంగా సముద్రంలో ఉంటే విచిత్రమైన చేపలు, జీవులు అట్లుపోట్లు సంభవించే ప్రాంతంలో కనిపిస్తుంటాయి. తాజాగా రాలిన ఆకు లాంటి శరీరం ఉన్న అరుదైన జీవి విశాఖ తీరంలో కనిపించింది. అత్యంత అరుదైన ‘ఫ్లాట్‌వార్మ్‌’ జాడ విశాఖలో తొలిసారిగా వెలుగు చూసింది. రక్తనాళాలు లేని ఈ జీవి లేత, ముదురు నీలి రంగు, మధ్యలో పొడవైన పసుపురంగు వెన్నుతో కనువిందు చేస్తోంది.

సముద్రం అటుపోట్లు వచ్చే ప్రాంతంలో అరుదైన జాతులు/జీవులపై పరిశోధనలు చేస్తున్నారు విశాఖకు చెందిన ఈస్ట్‌కోస్ట్‌ కన్జర్వేషన్‌ టీమ్‌ సభ్యులు. వైజాగ్‌ తీరంలో ప్రతి రెండు వారాలకు మెరైన్‌ వాక్‌ చేపడుతున్నారు. ఇందులో ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఫ్లాట్‌వార్మ్‌ గురించి ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ రీసెర్చ్‌ థాట్‌ జూలై మొదటి వారంలో ప్రచురించింది.

ఇవి కూడా చదవండి

విశాఖలో మెరైన్‌ బయాలజిస్టు శ్రీచక్ర ప్రణవ్‌ నేతృత్వంలోని విమల్‌రాజ్, మనీష్‌ మానిక్, పవన్‌సాయిలు ఈ ఫ్లాట్‌వార్మ్‌ను గుర్తించి రికార్డు చేశారు. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు విషపూరితాలు. వీటికున్న రంగుల ద్వారా ఇతర జంతువులు వాటిని విషపూరితాలుగా గుర్తించి దగ్గరకు రానీయవు.. వెళ్లవు. ఇవి చిన్న చిన్న పీతలను, వీటికన్నా చాలా చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాయి.