AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna – Venkatesh: సౌండ్ చేయని నాగార్జున, వెంకటేష్.. సీనియర్ హీరోల సైలెన్స్ ఎందుకు..?

మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. బాలయ్య కూడా సెట్స్ మీద ఉన్న సినిమాను జెట్ స్పీడుతో కంప్లీట్ చేసేస్తున్నారు.

Nagarjuna - Venkatesh: సౌండ్ చేయని నాగార్జున, వెంకటేష్.. సీనియర్ హీరోల సైలెన్స్ ఎందుకు..?
Venkatesh, Nagarjuna (File Photos)Image Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Aug 02, 2022 | 12:19 PM

Share

Tollywood News Updates: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) కూడా సెట్స్ మీద ఉన్న సినిమాను జెట్ స్పీడుతో కంప్లీట్ చేసేస్తున్నారు. ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా ఆల్రెడీ అనౌన్స్‌ చేసేశారు. కానీ సీనియర్‌ హీరోల సెగ్మెంట్‌లోనే ఉన్న అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), దగ్గుబాటి వెంకటేష్ (Venkatesh) మాత్రం ఇంత స్పీడు చూపించటంలో లేదు. చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నా… న్యూస్‌లో మాత్రం వీళ్ల పేర్లు పెద్దగా వినిపించటం లేదు. ఇంతకీ ఈ పరిస్థితికి కారణం ఏంటి?

ఏకంగా మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి… రెగ్యులర్‌గా షూటింగ్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. దసరాకి గాడ్‌ ఫాదర్ రిలీజ్ అన్న హింట్ కూడా ఇవ్వటంతో ఆల్రెడీ ఫ్యాన్స్‌ సెలబ్రేషన్‌ మోడ్‌లోకి వచ్చేశారు. అటు బాలయ్య కూడా ఎన్బీకే 107 వర్క్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ మూవీ కూడా దసరా బరిలోనే రిలీజ్ కానుంది.

చిరు, బాలయ్య ఈ రేంజ్‌లో సౌండ్ చేస్తుంటే.. నాగ్‌, వెంకీ మాత్రం స్లో అండ్‌ స్టడీ అన్నట్టుగా ఉంటున్నారు. ప్రజెంట్ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీ చేస్తున్నారు కింగ్‌. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్‌లో రిలీజ్‌ కానుంది. బాలీవుడ్‌ మూవీ బ్రహ్మాస్త్రలో కూడా కీలక పాత్రలో నాగార్జున నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9న ఆడియన్స్‌ ముందుకు రానుంది. అయితే రిలీజ్‌డేట్స్‌ దగ్గర పడుతున్నా… కింగ్ కాంపౌండ్‌ నుంచి సందడి మాత్రం పెద్దగా కనిపించటం లేదు.

ఇవి కూడా చదవండి

దగ్గుబాటి హీరో వెంకటేష్‌ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఎఫ్ 3 రిలీజ్‌ తరువాత పూర్తిగా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు వెంకీ. ప్రజెంట్ అబ్బాయ్‌ రానా దగ్గుబాటితో కలిసి రానా నాయుడు అనే వెబ్‌ సిరీస్‌లో ఈ సీనియర్‌ హీరో నటిస్తున్నారు. ఈ షో త్వరలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తున్నా… ప్రమోషన్‌ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో వెంకీ నుంచి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌.

మరిన్ని సినిమా వార్తలు చదవండి