Samantha: సమంత జీవితం వడ్డించిన విస్తరికాదు.. నెట్టింట్లో వైరలవుతున్న సామ్ ఎమోషనల్ వీడియో..

తాను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టాపర్ అని.. కానీ కుటుంబ పరిస్థితులు ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో ఉన్నత చదువులు చదవలేకపోయానని తెలిపింది.

Samantha: సమంత జీవితం వడ్డించిన విస్తరికాదు.. నెట్టింట్లో వైరలవుతున్న సామ్ ఎమోషనల్ వీడియో..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 02, 2022 | 12:40 PM

సాధారణంగా సెలబ్రెటీల జీవితం అంటే విలాసవంతమైన బంగ్లాలు.. నౌకల్లాంటి కార్లు.. పదుల సంఖ్యలో నౌకర్లు ఉంటారు. ఎలాంటి కష్టాలు లేకుండా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటారు. కానీ వారి జీవితాల్లోనూ ఎన్నో కష్టాలు ఉంటాయి. ప్రపంచానికి తెలియని కఠిన రోజులను గడిపినవారుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్స్ గా ఎదిగినవారి లైఫ్ ఒకప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నవారే. ఉన్నత చదువులు చదివి అనుకోకుండా సినీ పరిశ్రమలోకి వచ్చినవారు కొందరు. నటనపై ఆసక్తితో ఉద్యోగాలను వదిలి ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన వారు మరికొందరు. కానీ ఇంట్లోని ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టేక్కేందుకు మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి.. ఇప్పుడు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలుగుతుంది సమంత (Samantha). ఆమె నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదట. కానీ పరిస్థితుల ప్రభావంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టానని చాలాసార్లు చెప్పుకొచ్చింది. దక్షిణాది ఇండస్ట్రీలో లేడీ సూపర్ క్వీన్ గా తనకంటూ స్పెషల్ క్రియేట్ చేసుకున్న సమంత.. హీరోయిన్ కాకముందు ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొంది. తన పోరాటాల గురించి చెబుతూ దేశంలోని యువత కలలు కనాలని.. అందుకు తగినంత శ్రమ పడాలని తెలిపింది.

గతంలో ఓ వేడుకలో పాల్గోన్న సమంత మాట్లాడుతూ.. తాను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టాపర్ అని.. కానీ కుటుంబ పరిస్థితులు ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో ఉన్నత చదువులు చదవలేకపోయానని తెలిపింది. ఆ సమయంలో తన కలలు, ఆశలను వదిలేసి డబ్బు సంపాదించడానికి అనేక పనులు చేసింది. ఆ క్రమంలోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అలాగే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఏమాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత సామ్ వెనుదిగిరి చూసుకోలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సామ్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. ప్రస్తుతం సమంత ఆస్తి రూ.90 కోట్లకు పైగానే ఉన్నట్లు టాక్ .

ఇవి కూడా చదవండి

మీ కలలను ఏదీ ఆపలేదు.. అందుకే ప్రతి ఒక్కరూ కలలు కనండి. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైన కలలను నిజం చేసుకోండి అంటూ యువతను ప్రేరేపిస్తూ తన జీవితం గురించి చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత యశోద, ఖుషి సినిమాల్లో నటిస్తుంది. మరోవైపు ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.