AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagachaitanya: ‘ఆ కారణంతోనే బాలీవుడ్ సినిమాలకు నో చెప్పాను’.. అసలు విషయం చెప్పేసిన చైతూ..

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు.

Nagachaitanya: 'ఆ కారణంతోనే బాలీవుడ్ సినిమాలకు నో చెప్పాను'.. అసలు విషయం చెప్పేసిన చైతూ..
Chaitu
Rajitha Chanti
|

Updated on: Aug 02, 2022 | 11:45 AM

Share

లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తున్నాడు యువసామ్రాట్ నాగచైతన్య. కెరీర్ ప్రారంభించిన దశాబ్దం తర్వాత బీటౌన్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమాతో హిందీ ప్రేక్షకులను అలరించనున్నాడు చైతూ. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే తాను ఇప్పటివరకు హిందీ సినిమాలలో నటించకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చారు చైతూ.

గత కొద్ది కాలంగా తనకు హిందీ సినిమా ఆఫర్స్ వస్తున్నాయని.. వాటన్నింటిని తాను రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. ” నేను చెన్నైలో పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్ కు మారాను. నేను హిందీలో అంత ఫర్ఫెక్ట్ కాదు. ఈ విషయంలో నేను చాలా కాలం నమ్మకంగా లేను. అందుకే హిందీ సినిమా ఆఫర్స్ రిజెక్ట్ చేశాను. కానీ లాల్ సింగ్ చద్దా ఆఫర్ వచ్చినప్పుడు వారికి ముందు నో అని చెప్పాను. అందుకు అమీర్ సర్ సైతం ఓకే అన్నారు. కానీ ఈ సినిమాలో నేను సౌత్ నుంచి నార్త్ వెళ్లే అబ్బాయిగా కనిపిస్తాను. అక్కడి నుంచే మా ఇద్దరి ప్రయాణం ప్రారంభమవుతుంది. నేను మాట్లాడే విధానంలో దక్షిణాది కుర్రాడిగా ఉండాలని చెప్పారు. హిందీ మాట్లాడతాను. కానీ అక్కడక్కడ తెలుగు పదాలు, తెలుగు యాసను తీసుకువచ్చినప్పుడు దర్శకుడు కూడా ఓకే అన్నాడు. అంతేకాకుండా సౌత్ అబ్బాయి పాత్ర అని తెలుగు రుచిని తీసుకురావాడనికి కొన్నిచోట్ల తెలుగు పదాలను చేర్చాము.” అంటూ చెప్పుకొచ్చారు. సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆర్మీ ఆఫీసర్ బోడి బాలరాజు పాత్రలో చైతూ కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తు్న్నారు.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..