Pooja Hegde: ప్రకృతిలో ఒడిలో సేదతీరుతున్న బుట్టబొమ్మ.. నెట్టింట వైరలవుతున్న పూజాహెగ్డే లేటేస్ట్ ఫోటోస్..
పూజా హెగ్డేకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్ డీసీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పూజా.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28, జనగణమన సినిమాల్లో నటిస్తోంది. పూజాకు సోషల్ మీడియాలోనూ భారీగానే ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఫాలోయింగ్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. ఫోటోస్ షేర్ చేస్తూ.. ట్రీహగ్గర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
పూజా హెగ్డేకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్ డీసీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడి నుంచి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు స్పందిస్తూ.. గార్జియస్, బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా విజయ్ దేవరకొండ సరసన జనగణమన సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28లో నటిస్తోంది. అలాగే సల్మాన్ సరసన కబీ ఈద్ కబీ దీపావళి చిత్రంలో నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.