Rakul Preeth Singh: టాలీవుడ్లోకి రకుల్ రీఎంట్రీ ఇవ్వనుందా ?.. పంజాబీ బ్యూటీ ప్లాన్ అదేనా..
అయితే గత కొంతకాలంగా తెలుగులో రకుల్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేనట్లు తెలుస్తోంది..
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh). మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ పంజాబీ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. దక్షిణాదిలో అగ్రకథానాయికగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యింది. అయితే గత కొంతకాలంగా తెలుగులో రకుల్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేనట్లు తెలుస్తోంది.. దీంతో ఆమె నుంచి ప్రాజెక్ట్ అనౌన్స్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు రకుల్ తెలుగు సినిమాలు ఎందుకు చెయట్లేదు అనే సందేహాలను నెట్టింట వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రకుల్ సిద్ధమైననట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే తెలుగు చిత్రదర్శకుల పట్ల రకుల్ అసహనంతో ఉన్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ రకుల్ చేసిన పాత్రలన్ని కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో రకుల్ ఇప్పటివరకు కనిపించలేదు. దీంతో లేడీ ఓరియెంటెడ్ లేదా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తనకు బయోపిక్స్.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలనున్నట్లు ఇటీవల రకుల్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడ రకుల్ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుందని.. ఈ క్రమంలోనే బయోపిక్స్, పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసేందుకు తాను సిద్ధమని చెప్పినట్లు తెలుస్తోంది. రకుల్ చివరిసారిగా డైరెక్టర్ క్రిష్, మెగా హీరో వైష్ణవ్ కాంబోలో వచ్చిన కొండపొలం చిత్రంలో కనిపించింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.