AP Weather Alert: ఏపీ వాసులకు హెచ్చరిక.. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

రాగల 24 గంటల్లో ఏపీలోని వాతావరణానికి సంబంధించిన వివరాలను అమరావతి డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఎక్కడ ఏ రేంజ్ లో వానలు కురుస్తాయో వివరంగా తెలిసేలా ఓ మ్యాప్ ను జత చేసింది.

AP Weather Alert: ఏపీ వాసులకు హెచ్చరిక.. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Telangana Rains
Follow us
Surya Kala

|

Updated on: Aug 03, 2022 | 9:21 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ లో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న 3 రోజులపాటు తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది.  కోస్తా ఆంధ్రా, యానాం, ఉత్తరాంధ్ర సహా రాయలసీమ ప్రాంతాలల్లో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు మినహా వివిధ జిల్లాలో వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల 24 గంటల్లో ఏపీలోని వాతావరణానికి సంబంధించిన వివరాలను అమరావతి డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఎక్కడ ఏ రేంజ్ లో వానలు కురుస్తాయో వివరంగా తెలిసేలా ఓ మ్యాప్ ను జత చేసింది.

ఇవి కూడా చదవండి

రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, కడప, ఉమ్మడి అనంతపురం తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, కడప జిల్లాలోని  కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మరోవైపు అనంతపురం, సత్యసాయి జిల్లాలలో వర్షం దంచికొడుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వానలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నారు. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చత్రపతి నదికి పోటెత్తిన వరద నీరు.. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా పంటలకు నష్టం కలిగిందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత మూడు రోజులుగా జిల్లాను వదలని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం అవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..